ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్.. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆలస్యం

Published : Dec 29, 2022, 10:21 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్.. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆలస్యం

సారాంశం

ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆహా యాప్ పై అన్ స్టాపబుల్ షో కోసం ఎగబడడంతో సర్వర్లు డౌన్ అయ్యాయి.  దీనితో ప్రభాస్ ఎపిసోడ్ ఆలస్యం అవుతోంది.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 తిరుగులేని టాక్ షో గా మారుతోంది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు.శర్వానంద్, అడివి శేష్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ షోకి హాజరయ్యాడు. 

డిసెంబర్ 30 నుంచి ఈ షోలో ప్రసారం అవుతుందని ఆహా ముందుగా ప్రకటించింది. అయితే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు కాస్త ముందుగానే అంటే ఈ రాత్రి 9 గంటల నుంచే ప్రభాస్ ఎపిసోడ్ ని ప్రసారం చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రభాస్ అభిమానుల దెబ్బకు ఆహా యాప్ క్రాష్ ఐంది. 

ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆహా యాప్ పై అన్ స్టాపబుల్ షో కోసం ఎగబడడంతో సర్వర్లు డౌన్ అయ్యాయి.  దీనితో ప్రభాస్ ఎపిసోడ్ ఆలస్యం అవుతోంది. ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తాం అని ఆహా సంస్థ ట్విటర్ లో పేర్కొంది. 

ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ లని ఒకే వేదికపై చూసేందుకు ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులు ఇది నిరాశగా మారింది. అయితే త్వరలోనే సమస్య పరిష్కరించి ఎపిసోడ్ ని లైవ్ లో ఉంచేందుకు ఆహా టీం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే అనేక ప్రోమోలు విడుదలై ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేశాయి.  ఈ షోలో బాలయ్య ప్రభాస్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగారో అని ఫ్యాన్స్ ఉత్కంఠకి గురవుతున్నారు. ప్రభాస్ అంటే ఫ్యాన్స్ లో మొదట వినిపించే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని. ప్రభాస్ పెళ్లి, రాంచరణ్ తో ఫోన్ కాల్, పాన్ ఇండియా చిత్రాల గురించి.. ఇలా ఈ ఎపిసోడ్ లో అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఉన్నట్లు తెలుస్తోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్