టీమిండియా కెప్టెన్ తో హీరో యష్.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న పిక్, వీళ్ళని మించిన హిట్టర్స్ ఉన్నారా..

By team teluguFirst Published Dec 29, 2022, 9:06 PM IST
Highlights

కెజిఎఫ్ ప్రాంచైజీతో కన్నడ స్టార్ యష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. బాక్సాఫీస్ వద్ద కెజిఎఫ్ మొదటి భాగం ఊహించని విజయం సాధిస్తే.. అంతకు మించేలా కెజిఎఫ్ 2 విధ్వంసం సృష్టించింది.

కెజిఎఫ్ ప్రాంచైజీతో కన్నడ స్టార్ యష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. బాక్సాఫీస్ వద్ద కెజిఎఫ్ మొదటి భాగం ఊహించని విజయం సాధిస్తే.. అంతకు మించేలా కెజిఎఫ్ 2 విధ్వంసం సృష్టించింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కెజిఎఫ్ 2 అనేక రికార్డులు నెలకొల్పింది. దీనితో యష్ ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు. 

యష్ తదుపరి చిత్రం ఎప్పుడు అంటూ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే యష్ తన నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించలేదు. తాజాగా ఇంటర్నెట్ షేక్ అయ్యే సంఘటన జరిగింది. ఇప్పుడిప్పుడే టీమిండియా కెప్టెన్ గా పగ్గాలు అందుకుంటున్న పవర్ హిట్టర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. హీరో యష్ ని కలిశాడు. 

తన సోదరుడు క్రునాల్ పాండ్యతో కలసి హీరో యష్ ని మీట్ అయ్యాడు. ఈ సందర్భంగా వీరు యష్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తూఫాన్ లాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు హార్థిక్ పాండ్య 'కెజిఎఫ్ 3' అంటూ కామెంట్ పెట్టాడు. 

ఈ అరుదైన సంఘటన చూసి నెటిజన్ల సంతోషం కట్టలు తెంచుకుంటోంది. రకరకాలుగా కామెంట్స్ పెడుతూ తమ సంతోషం తెలుపుతున్నారు. 'వీళ్ళని మించిన పవర్ హిట్టర్స్ ఉన్నారా' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యష్ బాస్ తో టీమిండియా బాస్ అని మరికొందరు, పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా జనవరి 8న యష్ తానా పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజు యష్ తదుపరి చిత్రం గురించి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

click me!