అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ లేదు.. అఫీషియల్

Published : Jan 06, 2018, 04:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ లేదు.. అఫీషియల్

సారాంశం

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి ఈ చిత్రం ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కాపీ అంటూ వార్తలు ట్రైలర్ రిలీజ్ చేయకుండానే సినిమా రిలీజ్ కు వెళ్తున్నట్లు ప్రకటించిన మెగా పీఆర్వో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రానికి ఇప్పటికే యమా క్రేజ్ వచ్చింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఆడియో సాంగ్స్ తో పాటు.. పవన్ కల్యాణ్ పాడిన కొడకా కొటేశ్వర్ రావు పాటతో అజ్ఞాతవాసి చిత్రానికి యమా క్రేజ్ వచ్చింది. ఇక జనవరి 10న రిలీజ్ కానున్మన ఈ చిత్రం ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అటు పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు మొత్తం తెలుగు ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

 

ఓపక్క రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటం, మరోపక్క అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ చిత్రానికి కాపీ అంటూ వార్తలు రావటంతో సినిమాపై పెద్దయెత్తున సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీనికి తోడు కాపీరైట్ ఆరోపణలపై దర్శకుడు త్రివిక్రమ్ కూడా స్పందించకపోవడంతో... అనుమానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. అంతే కాక రిలీజ్ డేట్ దగగ్గరపడుతున్నా ట్రైలర్ రిలీజ్ కాకపోవడంతో అభిమానుల్లో అజ్ఞాతవాసి రిలీజ్ పై మరింత ఉత్కంఠ నెలకొంది. టీ సిరీస్ సంస్థ సదరు చిత్రం హక్కులు కలిగివుందని, కాపీరైట్ సమస్య తలెత్తకుండా చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.

 

తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, మెగా పీఆర్వో సంతోషం మేగజిన్ నిర్వాహకులు సురేష్ కొండేటి అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ లేకుండానే సినిమా రిలీజ్ కానుందని బాంబ్ పేల్చారు. తన ట్విటర్ ఎకౌంట్ లో ఇప్పటికే మూవీకి ఫుల్ క్రేజ్ వచ్చినందున  సినిమాను ట్రైలర్ రిలీజ్ చేయకుండానే రిలీజ్ చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే అజ్ఞాతవాసి చిత్రానికి ప్రి రిలీజ్ బిజినెస్ కూడా సూపర్ గా జరిగిందని, అంతా న్యూ ఇయర్ విషెస్ తో పాటు అజ్ఞాతవాసి టికెట్స్ గురించే మెసేజ్ లు షేర్ చేసుకుంటున్నారని ట్వీట్ చేశారు. ఇంగ్లీష్ తెలిసిన వాళ్లకు ట్వీట్ మీనింగ్ వేరే లాగ అనిపించొచ్చు. అయితే ఓకే.

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు