
హైదరాబాద్: టాలీవుడ్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై ఐటీ ప్రత్యేక బృందాలు దాడులు చేస్తున్నట్టగా తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ నివాసంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. బుధవారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.