మొన్న శృతి నేడు రకుల్... బాలయ్య అంటే నో అంటున్న స్టార్ హీరోయిన్స్!

By team telugu  |  First Published May 30, 2021, 6:11 PM IST

క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య మూవీ కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 


కొన్నాళ్లుగా బాలయ్య ప్రక్కన స్టార్ హీరోయిన్స్ ఎవరూ నటించడం లేదు. కొందరిని నొప్పించినా ఇది నిజం. టూ టైర్ హీరోయిన్స్ లేదా ఫార్మ్ కోల్పోయిన టాప్ హీరోయిన్స్ మాత్రమే ఆయనతో జతకడుతున్నారు. స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న హీరోయిన్స్ ని అడిగితే ఏవేవో కారణాలు చూపి తప్పించుకుంటున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సైతం బాలయ్య సినిమాకు నో చెప్పినట్లు టాలీవుడ్ లో ప్రచారం అవుతుంది. 


క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య మూవీ కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించారట దర్శకుడు గోపీచంద్. అయితే రకుల్ చేయడం కుదరదని సున్నితంగా చెప్పారట. బాలీవుడ్ లో చేస్తున్న వరుస ప్రాజెక్ట్స్ వలన డేట్స్ అడ్జస్ట్ కావని, అందుకే చేయలేని చెప్పారట. 

Latest Videos


డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం అనేది సాకు మాత్రమే అని కొందరు అంటున్నారు. రకుల్ కంటే ముందు శృతి హాసన్ ని అడిగారట. సలార్ మూవీ చేస్తున్న కారణంగా బాలయ్య సినిమాలో నటించడం కుదరదని ఆమె చెప్పారట. టాలీవుడ్ టాప్ స్టార్ గా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బాలయ్యకి హీరోయిన్ దొరకక పోవడం దారుణం. బాలయ్య నటించిన గత సినిమాల విషయంలో కూడా ఈ పరిస్థితి తలెత్తింది. కాగా బాలయ్య నటించిన కథానాయకుడు మూవీలో రకుల్ ఓ సాంగ్ లో ఆయనతో స్టెప్స్ వేశారు. 
 

click me!