రామ్ చరణ్ 'ప్లాన్ బి'..దేని కోసం అంటే

By Surya Prakash  |  First Published May 30, 2021, 5:45 PM IST

ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.


తన మార్కెట్ ని పెంచుకునేందుకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. అందులో భాగంగా ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రెండు నెలల క్రితం ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్సమెంట్ సైతం వచ్చేసింది.  అయితే భారతీయకుడు2 కు సంభందించి శంకర్ లీగల్ ఇష్యూలలో ఇరుక్కున్నారు.

‘ఇండియన్-2’ (భారతీయుడు-2) రూపొందిస్తున్నట్లు శంకర్ కొంతకాలం క్రితం ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే కొన్ని అనూహ్య కారణాల వల్ల 60 శాతం పూర్తైన ఈ సినిమా నిలిచిపోయింది. మరోవైపు శంకర్ తన తదుపరి ప్రాజెక్టులను కూడా ప్రకటించారు. అయితే ఒప్పందం ప్రకారం తమతో సినిమా పూర్తి చేయకుండానే వేరే సినిమాలు ప్రారంభించిన శంకర్‌పై లైకా ప్రొడక్షన్స్ కోర్టులో కేసు వేసింది.  ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుంటే అర్దం కాని పరిస్దితి.

Latest Videos

 దాంతో రామ్ చరణ్ తో శంకర్ సినిమా పరిస్దితి  పరిస్దితి ఏమిటన్నది ఎవరికీ అర్దం కావటం లేదు.  అయితే ఈ విషయం గుర్తించిన రామ్ చరణ్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్లాబ్ బి ఆయన పెట్టుకున్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ లేటు అయ్యేటట్లు ఉన్న పక్షంలో గ్యాప్ రాకుండా ఉండేందుకు కానీ వేరే పెద్ద డైరక్టర్స్ కథలు విని ఫైనలైజ్ చేయాలని భావిస్తున్నారట. అందుకు సంభందించి మీటింగ్స్ లు జూమ్ లో జరుగుతున్నాయట. 

ఇక శంకర్ తో చెర్రీ చేసే ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉండనుందని టాక్ కాగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్ర ఉన్నదట. ఆపాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను ఎంపిక చేసేపనిలో ఉన్నారని అంటున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరోకాదు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఈ నేపథ్యంలో శంకర్ – చరణ్ లతో ఉన్న పరిచయాలతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు సల్మాన్ ఒప్పుకోకపోయినా ఎవరో ఒకరు స్టార్ హీరోతోనే ఆ పాత్రను చేయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన చరణ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తారక్ ఈ మూవీలో కొమురం భీం గా కనిపించనున్నాడు. ఈసినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడు రామ్ చరణ్.
 

click me!