వైరముత్తుపై యంగ్ లిరిసిస్ట్ సంచలన ఆరోపణలు!

Published : Jan 18, 2019, 03:13 PM IST
వైరముత్తుపై యంగ్ లిరిసిస్ట్ సంచలన ఆరోపణలు!

సారాంశం

మీటూ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన వైరముత్తు మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి యంగ్ లిరిసిస్ట్ కార్తిక్.. వైరముత్తుపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

మీటూ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన వైరముత్తు మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి యంగ్ లిరిసిస్ట్ కార్తిక్.. వైరముత్తుపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గతేడాది విడుదలైన '96' సినిమాలో కార్తిక్ రాసిన పాట బాగా ఫేమస్ అయింది.

గతేడాదికి గానూ ఉత్తమ పాటల్లో కార్తిక్ రాసిన 'అంతాతీ నీ' ఉత్తమ పాటగా నిలిచింది. ఈ క్రమంలో కార్తిక్ పలు మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా సాహిత్య రచయిత వైరముత్తుపై సంచలన కామెంట్స్ చేశాడు కార్తి. 'వాగై సోడా వా' అనే సినిమాలో 'సారా సారా సరకాత్తు' అనే పాటను రాసింది తానైతే వైరముత్తు టైటిల్స్ లో తన పేరు వేయించుకున్నాడని కార్తిక్ చెప్పాడు.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తన పాటలకు  వైరముత్తు క్రెడిట్ కొట్టేశారంటూ ఆరోపించాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు నెటిజన్ల నుండి కార్తిక్ కి వ్యతిరేకత వచ్చింది.

దీంతో వెనక్కి తగ్గిన కార్తిక్.. ప్రస్తుతం తను సిటీలో లేనని ఈ విషయం గురించి ఇప్పుడేం మాట్లాడలేనని ఓ ఆంగ్ల మీడియాతో చెప్పాడు. ఇంటర్వ్యూలు ఇచ్చిన మాట నిజమేనని కానీ ఏం మాట్లాడానో గుర్తు లేదని అన్నారు. వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేస్తోన్న సింగర్ చిన్మయి.. కార్తిక్ కి మద్దతు పలికింది.  

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌