పవన్ మూవీకి లీకుల బెడద... ఆయన దేవుడు లుక్ అవుట్!

Published : Feb 26, 2023, 10:40 AM ISTUpdated : Feb 26, 2023, 11:06 AM IST
పవన్ మూవీకి లీకుల బెడద... ఆయన దేవుడు లుక్ అవుట్!

సారాంశం

పవన్ కళ్యాణ్ మూవీకి లీకుల బెడద మొదలైంది. వినోదయ సితం రీమేక్ నుండి వర్కింగ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. 

పవన్ కళ్యాణ్ వినోదయ సితం రీమేక్ సెట్స్  మీదకు తీసుకెళ్లారు. ఈ మూవీ చిత్రీకరణ చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఒక ప్రక్క సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒప్పుకున్న చిత్రాలు గట్టెక్కించాలని భావిస్తున్నారు. హరి హర వీరమల్లు సెట్స్ పై ఉండగానే వినోదయ సితం రీమేక్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో పవన్ పాత్ర నిడివి తక్కువ. అందుకే 20 నుండి 25 రోజులు మాత్రమే కేటాయించారట. మొదట పవన్ పార్ట్ షూట్ చేస్తారట. వీలైనంత త్వరగా వినోదయ సితం షూట్ నుండి పవన్ ని విడుదల చేయాలనుకుంటున్నారు. 

కాగా మరో ఆరు నెలల్లో ఈ చిత్ర విడుదలవుతుందని అంటున్నారు. 2023 ఆగష్టులోనే వినోదయ సితం రీమేక్ రిలీజ్ చేస్తున్నారట. నిరవధికంగా షూట్ ని యూనిట్ ప్లాన్ చేశారట. ఇదిలా ఉంటే వినోదయ సితం సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవుతున్నాయి. రెడ్ షర్ట్ ధరించిన పవన్ కళ్యాణ్ కారుపై కూర్చొని ఉన్నారు. దర్శకుడు సముద్ర ఖని సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ లకు సీన్ వివరిస్తున్నారు. 

ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. దేవర, భగవంతుడు టైటిల్స్ కూడా పరిగణలో ఉన్నాయట. అయితే దేవుడు టైటిల్ నే ఫిక్స్ చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మూవీలో పవన్ భగవంతుడు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన చేసిన గోపాలా గోపాలా చిత్రాన్ని ఇది పోలి ఉంటుందని సమాచారం. తమిళంలో వినోదయ సితం చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించి నటించారు. ఒరిజినల్ వెర్షన్ లో సముద్రఖని చేసిన పాత్ర పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. 

పవన్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేశారట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మెప్పించే చిత్రం అవుతుందని యూనిట్ భావిస్తున్నారు. మెగా హీరోల మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చిత్రానికి పవన్ ఏకంగా రూ. 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?