Vijay Devarakonda: పూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సోషియో ఫాంటసీ చిత్రం?

By Sambi Reddy  |  First Published Jul 19, 2022, 3:21 PM IST

లైగర్, జనగణమన చిత్రాలే కాకుండా ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ విజయ్ దేవరకొండకు చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయట. జనగణమన చిత్రం తర్వాత ఈ మూవీ చేస్తారట.


ఒకే హీరోతో వరుసగా చిత్రాలు చేయడం పూరికి ఉన్న అలవాటే. కెరీర్ బిగినింగ్ లో ఆయన రవితేజతో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేశారు. రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి భారీ విజయాలు సాధించాయి. అలాగే వీరి కాంబినేషన్ లో నేనింతే, దేవుడు చేసిన మనుషులు లాంటి చిత్రాలు విడుదలయ్యాయి. తర్వాత పూరితో రవితేజకు బాగా గ్యాప్ వచ్చింది. 

వరుస పరాజయాలతో డీలాపడ్డ పూరి జగన్నాధ్(Puri Jagannadh) ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. భారీగా లాభాలు ఆర్జించాడు. ఇస్మార్ట్ శంకర్ విజయం ఇచ్చిన ఊపులో పూరి హీరో విజయ్ దేవరకొండతో లైగర్ ప్రకటించారు. ఆగస్టు 25న లైగర్ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే పూరి-విజయ్ మరో ప్రాజెక్ట్ ప్రకటించారు. జనగణమన టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం జనగణమన సెట్స్ పై ఉంది. 

Latest Videos

కాగా లైగర్(Liger), జనగణమన చిత్రాలే కాకుండా ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ విజయ్ దేవరకొండకు చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయట. జనగణమన చిత్రం తర్వాత ఈ మూవీ చేస్తారట. ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే ఇది సోసియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కనుందట.  దర్శకుడు పూరి కెరీర్ లో మొదటిసారి సోసియో ఫాంటసీ చిత్రం విజయ్ దేవరకొండలో చేయనున్నాడట. జనగణమన చివరి దశలో ఈ ప్రాజెక్ట్ ప్రకటన ఉంటుంది అంటున్నారు. 

మరోవైపు లైగర్ మూవీ ప్రమోషన్స్ చిత్ర యూనిట్ స్టార్ట్ చేశారు. జులై 21న లైగర్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ మూవీలో విజయ్(Vijay Devarakonda) ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. 

click me!