మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ ప్లాన్!

By Udayavani DhuliFirst Published Nov 17, 2018, 11:45 AM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో కూడా వరుస సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ స్వయంగా తన తండ్రి హీరోగా సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిరు 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపధ్యంలో సాగే ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. 

షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన తరువాత చిరంజీవి తన తదుపరి సినిమా దర్శకుడు కొరటాల శివతో చేయనున్నారు. ఇప్పటికే కొరటాల చిరుకి కథ చెప్పడం.

ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే దర్శకుడు త్రివిక్రమ్ కూడా చిరంజీవితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ సినిమా పూర్తయిన తరువాత త్రివిక్రమ్.. చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తారట. డివివి దానయ్య ఈ సినిమాను 
నిర్మించనున్నారు.

చిరు బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ ఓ కథను సిద్ధం చేశాడట. చిరుకి కూడా కథ నచ్చిందని సమాచారం. ఇటీవల 'అరవింద సమేత' చిత్రంతో సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అది పూర్తయిన తరువాత చిరు సినిమా కోసం కసరత్తులు మొదలుపెడతారు. 
 
click me!