విడాకులు తీసుకున్నా హ్యాపీగా ఉన్నాం... అమీర్ వీడియోపై మండిపడుతున్న నెటిజెన్స్

By team teluguFirst Published Jul 4, 2021, 9:06 PM IST
Highlights

ఓ విషాదకర విషయాన్ని సెలబ్రేషన్ మాదిరి ప్రెజెంట్ చేసిన అమీర్ తీరుకు కొందరు మండిపడుతున్నారు. అంతా బాగుంటే విడాకులు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో కిరణ్ రావ్ మాత్రం ఫేక్ స్మైల్ తో భాధ బయటపడకుండా జాగ్రత్త పడ్డట్లు అనిపించింది. 
 

మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరున్న అమీర్ ఖాన్ భార్యతో విడిపోతున్నట్లు చేసిన ప్రకటన బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను షాక్ కి గురిచేసింది. దానికి కారణం అమీర్, భార్య కిరణ్ రావ్ మధ్య విబేధాలు తలెత్తినట్లు ఎటువంటి ముందస్తు వార్తలు లేవు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన అమీర్, కిరణ్ రావ్ ల ఉమ్మడి సందేశం దిగ్భ్రాంతి కలిగించింది. ఎటువంటి కారణాలు తెలుపకుండానే తాము విడిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఈ దంపతులు. 


అమీర్ ఖాన్ అభిమానులను ఈ వార్త ఒకింత బాధకు గురి చేసింది. విడాకులు అనేది ఎవరి జీవితంలో అయినా బాధపెట్టే అంశమే. హ్యాపీగా ఉన్న భార్య భర్తలు విడిపోవాలని అనుకోరు. అమీర్, కిరణ్ రావ్ విడాకుల కారణంగా అనేక సందేహాలతో సతమతమవుతున్న వారికి అమీర్ ఖాన్ వీడియో సందేశం ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది.ఆ వీడియో భార్య కిరణ్ కలిసి చేశారు అమీర్.  భార్య కిరణ్ రావ్ పక్కన కూర్చున్న అమీర్, చాలా హ్యాపీగా కనిపించారు. 


''మా విడాకుల ప్రకటన విని మీరంతా షాక్ అయ్యుండొచ్చు. ఈ వార్త మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. కానీ ఈ నిర్ణయంతో మేమిద్ధం చాలా సంతోషంగా ఉన్నామని మీకు చెప్పాలనుకుంటున్నాము. విడాకులు తీసుకున్న కూడా మేము ఒకే కుటుంబంగా ఉంటాం. దీనివల్ల మా సంబంధంలోనే మార్పు వచ్చింది కానీ మేము ఎప్పటికీ ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం” అంటూ ఆ వీడియో ద్వారా అమీర్ తెలియజేశారు. 


ఓ విషాదకర విషయాన్ని సెలబ్రేషన్ మాదిరి ప్రెజెంట్ చేసిన అమీర్ తీరుకు కొందరు మండిపడుతున్నారు. అంతా బాగుంటే విడాకులు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో కిరణ్ రావ్ మాత్రం ఫేక్ స్మైల్ తో భాధ బయటపడకుండా జాగ్రత్త పడ్డట్లు అనిపించింది. 
 

click me!