హల్క్ లా మారిపోయిన వరుణ్.. లేటెస్ట్ లుక్ లో కిరాక్ పుట్టిస్తున్న యువహీరో

Published : Jul 04, 2021, 08:40 PM IST
హల్క్ లా మారిపోయిన వరుణ్.. లేటెస్ట్ లుక్ లో కిరాక్ పుట్టిస్తున్న యువహీరో

సారాంశం

ఆజానుబాహుడైన వరుణ్ ని కండలు పెంచిన శరీరంలో చూస్తే, హాలీవుడ్ ఎపిక్ రోల్ హల్క్ గుర్తుకు వస్తున్నాడు. యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని పేరుతో ఓ మూవీ చేస్తున్నారు వరుణ్. ఈ చిత్రంలో ఆయన ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు వరుణ్.


ఈ జనరేషన్ లో హీరోగా ఎదగాలంటే కేవలం కుటుంబం సపోర్ట్ ఉంటే సరిపోదు. టాలెంట్, కష్టపడే తత్త్వం చాలా అవసరం. పాత్రకు తగ్గట్టుగా తమ శరీరాలను మార్చుకుంటూ నేటి హీరోలు సత్తా చాటుతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ లుక్ చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే. ఈ ఆరున్నర అడుగుల మెగా హీరో లేటెస్ట్ మూవీ కోసం తన ఫిజిక్ పూర్తిగా మార్చేశాడు. గంటల తరబడి కఠిన కసరత్తులు చేసి, భారీగా కండలు పెంచాడు. విశాలమైన ఛాతి, భుజాలు కనిపించేలా జిమ్ వేర్ లో ఉన్న వరుణ్... ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. 


ఆజానుబాహుడైన వరుణ్ ని కండలు పెంచిన శరీరంలో చూస్తే, హాలీవుడ్ ఎపిక్ రోల్ హల్క్ గుర్తుకు వస్తున్నాడు. యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని పేరుతో ఓ మూవీ చేస్తున్నారు వరుణ్. ఈ చిత్రంలో ఆయన ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు వరుణ్. ప్రొఫెషనల్ బాక్సర్స్ దగ్గర శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఆ పాత్రలో మరింత పర్ఫెక్షన్ తేవడానికి ఇలా కండలు పెంచాడు. 


అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చేస్తున్న వరుణ్, షూటింగ్ లో పాల్గొంటున్నారు. సెకండ్ వేవ్ తరువాత ఎఫ్ 3 షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా, వెంకటేష్, మెహ్రీన్ కూడా జాయిన్ కావడం జరిగింది. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి ఎఫ్ 3 సీక్వెల్ గా తెరకెక్కుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే