బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ‘ఆదిపురుష్’ రోజుకో తీరుగా విమర్శలనైతే ఎదుర్కొంటోంది. తాజాగా నేపాల్ లో ‘ఆదిపురుష్’లోని ఆ సీన్ వల్ల బ్యాన్ విధించారు. అంతేకాదు ఇండియా సినిమాలను రద్దు చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరియు కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలిరోజునే మిశ్రమస్పందనను అందుకుంది. మరోవైపు రిలీజ్ కు ముందు నుంచే సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితోడు ప్రస్తుతం రోజుకోతీరు విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో నేపాల్ దేశంలో ఇండియన్ సినిమాలపై కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
నేపాల్‌లోని పోఖరా మెట్రోపాలిటన్ సిటీలో ఆదిపురుష్ సినిమాలోని ఒక డైలాగ్‌పై వివాదం తలెత్తింది. దీంతో భారతీయ చిత్రాల ప్రదర్శనను నిషేధించాలని ఖాట్మండు పోఖరా మేయర్ నిర్ణయం తీసుకున్నారు. సీతాదేవి నేపాల్ లో పుట్టిందని పురణాలు చెబుతుండగా ‘ఆదిపురుష్’లో మాత్రం ఇండియాలో పుట్టినట్టు చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగా నేపాలీ నగరంలోని సినిమా హాళ్లలో ఈరోజు నుంచి బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని పోఖరా మేయర్ ధనరాజ్ ఆచార్య ఆదేశాలు జారీ చేశారు.
నేపాల్ జాతీయ ప్రయోజనం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఆత్మగౌరవాన్ని రక్షించడం తమ బాధ్యతని ఆయన చెప్పారు. ఆదిపురుష్ సినిమా కంటెంట్ నేపాల్ జాతీయ గుర్తింపు, జాతీయత, సాంస్కృతిక ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉందని మేయర్ పేర్కొనడం గమనార్హం. ఖడ్మాండ్ లోని 17 సినిమా థియేటర్లలో భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధాన్ని అమలు చేశారు.
నేపాల్ లో ఆదిపురుష్ రిలీజ్ కూడా పలు డైలాగ్స్ కారణంగా ఆలస్యం అయ్యింది. చిత్ర నిర్మాణ సంస్థ, టి-సిరీస్ దీనిపై వివరణ ఇవ్వడంతో విడుదలకు అంగీకరించారు. ప్రస్తుతం బ్యాన్ విధించారు. ఇక ఇప్పటికే చిత్రంలోని ప్రేక్షకులకు ఇబ్బంది కలిగే డైలాగ్స్ ను కూడా మార్చబోతున్నామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారంలో న్యూ వెర్ష్ న్ ఆడియెన్స్ థియేటర్లలో చూడొచ్చు. విమర్శలు, వివాదాలు తలెత్తున్నా ‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లో రూ.300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.