స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) బాలయ్య సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు కాజల్ కు స్పెషల్ డే కావడంతో ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. బడా హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల గుండెల్లోనూ చోటు దక్కించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అయినా సినిమాకు దూరంగా ఉండటం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ములేపేందుకు సిద్ధమైంది.
ఈరోజు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ ముద్దుగుమ్మ నేటితో 37వ ఏట అడుగుపెట్టింది. దీంతో ఆమె అభిమానులు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు కాజల్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నుంచి కూడా స్పెషల్ పోస్టర్లు విడుదలవుతున్నాయి. ‘సత్యభామ’ టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ చిత్ర టీజర్ వచ్చి ఆకట్టుకుంది. ఇక తాజాగా Bhagavanth Kesari నుంచి కాజల్ ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. యూనిట్ కాజల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ రిలీజ్ చేసింది.
పోస్టర్ లో కాజల్ న్యూ లుక్ లో ఆకట్టుకుంది. వింటేజ్ కాజల్ లా కనిపిస్తోంది. గాగూల్ ధరించి, పింక్ డ్రెస్ లో బ్యూటీఫుల్ గామెరిసింది. చాలా కూల్ గా, బ్యూటీఫుల్ గా స్మైల్ ఇచ్చింది. ఏదో పుస్తకం చదువుతూ కనిపించింది. అయితే అనిల్ రావిపూడి కాజల్ అగర్వాల్ కోసం ‘భగవంత్ కేసరి’లో మునుపెన్నడూ లేని రోల్ ను డిజైన్ చేశారంట. ఆమె క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని, అలా కాజల్ ను గతంలో చూడలేదని చెప్పారు. పైగా బాలయ్యతో కాజల్ తొలిసారిగా నటిస్తుండటమూ ఇంట్రెస్టింగ్ గా మారింది.
బాలయ్య - అనిరావిపూడి చిత్రం శరవేగంగా కొనసాగుతోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కాజల్ బాలయ్య సరసన ఆడిపాడుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీలా కూతురిగా అలరించబోతోంది. రీసెంట్ గా బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. డైలాగ్స్, మాసీజం, యాక్షన్, ప్రతి విజువల్ కూడా సినిమాపై హైప్ ను పెంచేసింది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్ శరత్ కుమార్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Team wishes the ever-charming a very Happy Birthday ❤️
May your magnetic presence captivate the audience on the big screens 💥 💫 pic.twitter.com/H0wOwmLpeZ