
15 రోజుల క్రితం గుండెపోటతో హాస్పిటల్‌లో చేరిన స్టార్ కమెడియన్ శ్రీవాత్సవ్ కళ్లు తెరిచారు. ఆగస్టు 10న జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా రాజు శ్రీవాస్తవకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంత కాలం కోమాలో ఉన్న కమెడియన్ రాజు శ్రీవాత్సవ్ స్పృహలోకి వచ్చాడు. 15రోజులుగా అతన్ని ఎయిమ్స్ వైద్యులు మానిటర్ చేస్తున్నారని గర్విత్ నారంగ్ తెలిపారు.
జిమ్ చేస్తుండగా గుండె నొప్పి రావడం.. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువ అవుతుండటంతో.. ఈ స్టార్ కమెడియన్ విషయంలో ఇంకా అప్రమత్తం అయ్యారు డాక్టర్లు. హాస్పిటల్ లో జాయిన్ అయిన అదే రోజున 58 ఏళ్ల శ్రీవాత్సవ్‌కు ఆంజియోప్లాస్టీ చేశారు. డాక్టర్లు చాలా కష్టపడి ఆయన్ను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇక 2005లో ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో గెలిచిన శ్రీవాత్సవ్ ఆ తర్వాత తన కెరీర్‌లో ఫుల్ సక్సెస్ సాధించారు.
ప్రస్తుతం ఆయన బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని, అందరూ అతడి కోసం ప్రార్థించడంటూ రీసెంట్ గా ఆయన సన్నిహిడుతు నటుడు సునీల్ పాల్ ఓ వీడియో షేర్ చేశారు. అయితే అప్పటి నుంచి ఆయన కోసం కష్టపడుతున్నాయి హస్పిటల్ వర్గాలు. మరో వైపు స్టార్ కమెడియన్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఫ్యాన్స్ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. దాంతో ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించి 15 రోజుల తర్వాత కమెడియన్ స్పృహలోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.