
శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ కరోనా టైమ్ లోనూ ఫస్ట్ వీక్ ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్ పరిస్థితుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిందంటే ఇది కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి.
అయితే ఈ వారం కూడా మరిన్ని సినిమాలు థియేటర్లోకి రానుండటంతో ‘రాజ రాజ చోర’ కలెక్షన్స్ పై ఏమైనా ప్రభావం చూపిస్తాయేమో అని అందరూ ఎదురు చూసారు. అయితే అంత సీన్ లేదని తేలిపోయింది. సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటటర్, సుశాంత్ ఇచ్చట వాహనమలు నిలపరాదు రెండు చిత్రాలు థియోటర్ లో విడుదల అయ్యాయి. ఇచ్చట వాహనములు నిలపరాదు చిత్రం డిజాస్టర్ అయ్యింది.శ్రీదేవి సోడా సెంటర్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో రాజ రాజ చోర చిత్రానికే ప్లస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. రాజ రాజ చోర చిత్రాన్ని ప్రమోషన్ పరంగా పుష్ చేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన చిత్రాల్లో రాజ రాజ చోర, ఎస్ ఆర్ కళ్యాణమండపం మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాయి.
ఇక ‘రాజ రాజ చోర’ చిత్రానికి రూ.5 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం.అయితే ఇందులో చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.3.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.4.73 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1.5 కోట్ల లాభాలను అందించినట్లైంది.