అఫీషియల్: 'బ్యాచ్ లర్' .. రిలీజ్ డేట్ ఫిక్స్!

Surya Prakash   | Asianet News
Published : Aug 28, 2021, 12:18 PM IST
అఫీషియల్: 'బ్యాచ్ లర్' .. రిలీజ్ డేట్ ఫిక్స్!

సారాంశం

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎపుడో  విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. 

అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా, ఇప్పటికే విడుదల కావలసింది. కానీ రకరకాల కారణాలుతో పాటు కరోనా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, ఫోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

వివరాల్లోకి వెళితే...కెరీర్ మొదట్లోనే వరుసగా మూడు సినిమాలు చేసినా సరే అక్కినేని హీరో అఖిల్ ఒక్క సినిమాతో కూడా చెప్పుకోదగ్గ హిట్ కూడా సొంతం చేసుకోలేకపోయాడు. తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" పైన పెట్టుకున్నాడు అఖిల్. హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది.  ఎప్పుడో మే 2019 లో సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా ఇంతకాలం తర్వాత విడుదలకు సిద్ధం అవుతోంది.బన్నీ వాసు మరియు వాసు వర్మ, జీఏ 2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 8న విడుదలకు సిద్ధమవుతోంది.
 
  అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. గోపీ సుందర్ నుంచి వచ్చిన పాటలకి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి ఆయన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు. ఇక ఇదే రోజున వైష్ణవ్ తేజ్ 'కొండ పొలం' విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

మరో ప్రక్క అఖిల్.. సురేందర్ రెడ్డి  దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు.  వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి