
ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎప్పటికప్పుడు తన సినిమాల్లో కొత్త దనం చూపిస్తూ... న్యూ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వారిలో అడివిశేషు ఒకరు. తను సొంత సినిమాతో టాలీవుఢ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన కర్మ మూవీలోను నటించాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ వెంటనే ప్రారంభమైన, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నటించిన ‘పంజా’ సినిమాలో నటించిన అడివిశేషు కు కొంత గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్న అడివి శేషుకు బలుపు, కిస్, రన్ రాజా రన్, ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’ మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో కనిపించిన అడివిశేషు ‘గూఢాచారి’ మూవీలో లీడ్ రోల్ చేశారు. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి అడివి శేషు సినిమాలకు క్రేజ్ పెరిగింది. తన నెక్ట్స్ మూవీ ‘మేజర్’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను పూర్తి చేసుకోబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ తాజా అప్డేట్ ను అందింది.
కరోనాతో ఇప్పటికే పలు సినిమాల్లో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కాగా అడివి శేషు కూడా ఆగాల్సి న పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 11న రిలీజ్ కావాల్సిన మేజర్ చిత్రయూనిట్ తమ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో తెలియజేస్తామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు, దేశంలో ఏర్పర్చిన కొన్ని పరిమితుల మూలం ‘మేజర్’ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసినట్టు ‘జీఎంబీ’ సంస్థ పేర్కొంది.
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ఈ చిత్రాన్ని సోని పిక్చర్స్, జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ మరియు a+s మూవీస్ పతాకంపై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడ్డా విషయం తెలిసిందే.