Varsha : వాళ్లు చేసిన తప్పుకు.. మేం బాధపడుతున్నాం.. దయచేసి ఇంకెవ్వరూ ఇలా చేయకండి.. అంటూ వేడుకుంటున్న ‘వర్ష’

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 24, 2022, 05:33 PM IST
Varsha : వాళ్లు చేసిన తప్పుకు.. మేం బాధపడుతున్నాం.. దయచేసి ఇంకెవ్వరూ ఇలా చేయకండి.. అంటూ వేడుకుంటున్న ‘వర్ష’

సారాంశం

బుల్లితెరపై తనదైన శైలిలో అలరిస్తున్న వర్ష  తన జీవితంలో జరిగిన ఓ ఘటనతో  భావోద్వేగానికి గురైంది.  ఒకరి నిర్లక్ష్యం వల్ల తమ ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సి వస్తోందని పేర్కొంది.   

జబర్దస్ షోలో అలరిస్తున్న వర్ష  మోడల్‌గా కెరీర్‌ ఆరంభించింది.  బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఆమె ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్‌ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. జబర్దస్ ఫేమ్, కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తన అభిమానులకు, నెటిజన్లకు తన కుటుంబ సభ్యులకు జరిగిన ప్రమాదాన్ని గురించి తెలిపింది. ఈ సందర్భంగా చాలా భావోద్వేనికి లోనైంది. తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఫొటోను తన ఇనస్టాలో పోస్ట్ చేసింది.  

‘దయచేసి అందరినీ వేడుకుంటున్నాను.. మీరందరూ  డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా నడపండి. త్రిబుల్ రైడింగ్ లో నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడం వల్ల నా సోదరుడికి రోడ్ యాక్సిడెంట్‌ అయింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. దీంతో మా ఫ్యామిలీ అంతా చాలా  బాధపడుతోంది. ఇప్పటికే ఎవరూ తమ వాహనాలను డ్రైవ్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా.. తద్వారా మీఫ్యామిలీతో పాటు  మరే కుటుంబం కూడా సఫర్‌ కావాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం నా బ్రదర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది' అని వర్ష తెలిపింది. 

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వర్ష తన కుటుంబ సభ్యుడు రోడ్డు ప్రమాదానికి గురవడంతో చాలా భాదపడుతోంది. ఇంకెవ్వరూ ఇలాంటి ప్రమాదాల బారిన పడకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని వేడుకుంటోంది. లేదంటే  ఇతరుల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని తెలిపారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబ నుంచి హరిక్రిష్ణ, ఆయన కొడుకు, రవితేజ తమ్ముడు రోడ్డు ప్రమాదంలో  ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే