'ఐడియా' టెలికాం కంపనీపై యంగ్ హీరో ఫైర్!

Published : Jun 20, 2019, 04:57 PM IST
'ఐడియా' టెలికాం కంపనీపై యంగ్ హీరో ఫైర్!

సారాంశం

ఐడియా టెలికాం కంపనీపై టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ మండిపడ్డాడు. 

ఐడియా టెలికాం కంపనీపై టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ మండిపడ్డాడు. తాను విదేశాలకు వెళ్లే సమయంలో ఐడియా కంపనీ ఇంటర్నేషనల్ ప్యాక్ తో రీచార్జ్ చేయించుకున్నానని, కానీ విదేశాల్లో ఆ ప్యాక్ పనిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఐడియా కంపనీ తన డబ్బుని రీఫండ్ చేయలేదని, ఆ సంస్కారం కూడా లేదని విమర్శించారు. డబ్బులు ముఖ్యం కాదని, ఐడియా కంపనీ  అనైతికంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇక హైదరాబాద్ లో కాల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఎద్దేవా చేశారు.

ఈ విషయంలో ఐడియా ప్రతినిధుల స్పందన అధ్బుతంగా ఉందనీ.. వాళ్లకి కనీస పరిజ్ఞానం కూడా లేదని విమర్శించారు. దీనికి తోడు ప్రతీరోజు తనకు స్పామ్ కాల్స్ ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కారణాల వలన తాను ఐడియా నెట్ వర్క్ నుండి మారిపోతున్నట్లు చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో 'ఎవరు' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Pradeep Rawat: ప్రదీప్ రావత్ చివరి సినిమా ఇదే.. భిక్షు యాదవ్ నుంచి భిక్షు దాస్ వరకు సాగిన ప్రయాణం
Missing Meghana: నయా సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా `మిస్సింగ్‌ మేఘన`.. గోల్డెన్‌ హ్యాండ్ తో ఫస్ట్ లుక్‌