అదిరింది రిలీజ్ కు లైన్ క్లియర్..

Published : Nov 02, 2017, 08:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
అదిరింది రిలీజ్ కు లైన్ క్లియర్..

సారాంశం

అదిరింది మూవీ సెన్సార్ పూర్తి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు నవంబర్ 10న రిలీజ్ కానున్న అదిరింది జీఎస్టీపై డైలాగులకు కట్ లేకుండా సెన్సార్ 

తమిళ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మెర్సల్'. ఈ మూవీ దీపావళి కానుకగా విడుదలై కోలీవుడ్ లో భారీ విజయం సాధించింది. కలెక్షన్లతో పాటు అనేక వివాదాలకు కారణమైన... ఈ సినిమా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, జీఎస్టీని టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు చేస్తున్న డైలాగులతో ఉందంటూ ఆందోళనలు వెల్లువెత్తడం, కొందరు కేసులు వేయడం తెలిసిందే. అయినా సరే.. తమిళ వెర్షన్ దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసింది.

 

 

మెర్సల్ తెలుగులోనూ దీపావళి కానుకగా 'అదిరింది' పేరుతో విడుదలవ్వాల్సి ఉండగా... పలు కారణాలతో చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోయింది. నిజానికి తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఆన్‌లైన్ టిక్కెట్లు కూడా ఇష్యూ చేశారు. అయితే చివరి నిమిషంలో సినిమా విడుదల ఆగిపోవడంతో టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు.

 

 

అయితే.. మెర్సల్ తాజాగా సెన్సార్ క్లియరెన్స్ పొందినట్లు సోషల్ మీడియాలో ఓ సెన్సార్ సర్టిఫికెట్ తెగ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం నవంబర్ 10న మెర్సల్ తెలుగు వెర్షన్ అదిరింది రిలీజ్ అవుతోంది. అయితే దీనిపై నిర్మాత శరత్ మరార్ కానీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ నవంబర్ 10న మూవీ రిలీజ్  వుంటుందని సోషల్ మీడియాలో సెన్సార్ సర్టిఫికెట్ తెగ సర్కులేట్ అవుతోంది.

 

ఇక తాజాగా పొందిన సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ప్రకారం మెర్సల్ లోని వివాదాస్పద డైలాగులేవీ తెలుగు వెర్షన్ లో కట్ కావడంలేదని తెలుస్తోంది. జీ.ఎస్.టిపై తెలుగు వెర్షన్ లో డైలాగులన్నీ తెలుగు ప్రేక్షకులు చూడొచ్చని తెలుస్తోంది.

 

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సమంత, కాజల్, నిత్య హిరోయిన్లుగా నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా