హిందూ పురాణాల ఆధారంగా వస్తున్న‘ఆదిపురుష్’ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రం అడ్వాన్స్ బుక్కింగ్స్ ప్రారంభం అయ్యాయి. 50వేలకు పైగా టికెట్స్ అమ్ముడు పోయాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - కృతి సనన్ సీతారాములుగా నటించిన, హిందూ మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరోవైపు భారీ విజువల్స్ తో థియేటర్లలోకి రాబోతుండగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టికెట్స్ కు సంబంధించి అడ్వాన్డ్స్ బుక్కింగ్స్ ఓపెన్ కావడంతో కొనుగోలు చేస్తున్నారు.
ఇండియాలోని ఐదు ప్రధాన భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న Adipurushకి సంబంధించి అడ్వాన్స్ బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఒక్క తెలుగు స్టేట్స్ లో మాత్రం రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 50 వేల టికెట్స్ అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. కేవలం పీవీఆర్, సినిపొలిస్, ఐనాక్స్ లలోనే 35 వేల వరకు టికెట్లు బుక్ అయినట్టు తెలుస్తోంది. రిలీజ్ ముందుకు వరకు లక్షల్లో బుకింగ్స్ జరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘పఠాన్’ చిత్రం ఐదు లక్షల వరకు అడ్వాన్స్ బుక్కింగ్స్ ను దక్కించుకుంది. అయితే ‘ఆదిపురుష్’ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని అంటున్నారు. మరోవైపు సౌత్ నుంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేపటి నుంచి మాత్రం తెలంగాణలో అడ్వాన్డ్స్ బుక్కింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ రిలీజ్ సందర్బంగా ఆరో షోకు కూడా తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. టికెట్ ప్రైజ్ లో ఎలాంటి మార్పులేదని తెలుస్తోంది. ఇక ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఓ సీట్ ను ఖాళీగా ఉంచనున్నారు. ఆంజనేయుడిపై భక్తి సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఇప్పటికే అభిషేక్ అగర్వాల్, రన్బీర్ కపూర్, ఓ స్టార్ సింగర్ పదివేల వరకు టికెట్లను కొనుగోలు చేశారు. తెలుగు నుంచి మంచు మనోజ్ 2500 వరకు టిక్కెట్లు తీసుకొని పేదలకు సినిమా చూపించబోతున్నారు.