
స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్స్ సాధారణమే. తాజాగా రామ్ చరణ్-ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్లో మాటల యుద్ధం మొదలుపెట్టారు. రాముని గెటప్ లో మా హీరో తోపంటే మా హీరో తోపు అంటున్నారు. నేడు ఉదయం ఆదిపురుష్ నుండి ప్రభాస్ లుక్ విడుదల చేశారు. ఆకాశంలోకి విల్లు ఎక్కుపెడుతున్న ప్రభాస్ ఆకట్టుకుంది. అలాగే కోరమీసంతో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉంది. ట్రెడిషనల్ రాముడి గెటప్ కి భిన్నంగా ఆదిపురుష్ లో ప్రభాస్ ఉన్నాడు.
ఇక ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ లో రాజమౌళి హీరో రామ్ చరణ్ ని పూర్తి అల్లూరి సీతారామరాజు గా చూపించాడు. అదే సమయంలో రాముడిని తలపించేలా ఫోజులు, విల్లుతో యుద్ధం చేయించాడు. సినిమాలో రామ్ చరణ్ క్లైమాక్స్ లుక్ హైలైట్ అయ్యింది. రాముడి రిఫరెన్స్ ఉన్న ఆ పాత్ర, రామ్ చరణ్ గెటప్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లోని రామ్ చరణ్ లుక్ బయటికి తీసి ఆదిపురుష్ లుక్ తో పోలిక పెడుతున్నారు ఫ్యాన్స్.
రామునిగా ప్రభాస్ కంటే రామ్ చరణ్ బాగున్నారని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్-రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఇక న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. ఇలాంటి పోలికలు అనవసరం ఉంటున్నారు. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సంతృప్తిగా ఉన్నారు. అక్టోబర్ 2న టీజర్ విడుదల కానుంది. 2023 జనవరి 12న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.