‘బిగ్ బాస్’ నిలిపేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్.. ఘాటుగా స్పందించిన న్యాయస్థానం.!

By team teluguFirst Published Sep 30, 2022, 2:28 PM IST
Highlights

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు 6’ (Bigg Boss Telugu 6) కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టులో ఈ షోను నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం కూడా సిరీయస్ గా స్పందించింది.
 

పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘బిగ్ బాస్ తెలుగు 6’కు కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ గా వ్యహరిస్తున్నారు. ఇప్పటికే  షోకు సంబంధించిన ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’ షోకు భారీ షాక్ తగిలింది.ఈ షోను నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.  అడ్వకేట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై హైకోర్టు కూడా విచారణ జరుపుతోంది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ.. దీంతో యువత పెడదారులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పిటిషనర్. 

అంతేకాకుండా షో టైమింగ్స్ లోనూ మార్పులు చేయాలని కోరారు. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్  మార్గదర్శకాల  (IBF Guidelines) ప్రకారం షోను టెలికాస్ట్ చేయాల్సి ఉన్నా ఫాలో కావడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5  గంటలలోపే ప్రసారం చేయాలని కోరారు. లేదంటే వెంటనే ఈషోను నిలిపేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. తాజాగా పిటిషన్ పై న్యాయస్థానం కూడా ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది.  70లలో ఎలాంటి సినిమాలో వచ్చాయో తెలుసు కదా అని హైకోర్టు సూచించినట్టు సమాచారం. ఈ మేరకు తదుపరి విచారణను అక్టోబర్ 11కు న్యాయస్థానం వాయిదా వేసింది. అదే రోజు షోపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

అయితే ఈషోకు సంబంధించిన వివరాలతో కేంద్ర తరుఫు న్యాయవాది కూడా న్యాయస్థానానికి వివరణ ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఈసందర్భంగా పూర్వపరాలతో హైకోర్టులో హాజరవుతామని ఈమేరకు కాస్తా సమయం కోరినట్టు సమాచారం. దీంతో తదుపరి విచారణలో ‘బిగ్ బాస్’ తెలుగు షో కొనసాగింపుపై పూర్తి వివరాలు రానున్నాయి. ఎప్పుడూ బిగ్ బాస్ షోపై ఏదో చర్చ కొనసాగుతూనే ఉంటోంది. హ్యయేస్ట్ రేటింగ్ ఉన్నప్పటికీ ఈషోకు వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంది. అయితే ‘బిగ్ బాస్ షో’ను హిందీ, తమిళంలోనూ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఏపీ హైకోర్టు మాత్రం కేవలం ‘బిగ్ బాస్ తెలుగు  సీజన్ 6’పైనే సిరీయస్ అయినట్టు సమాచారం. 
 

click me!