హనుమాన్ జయంతి సందర్భంగా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ హైదరాబాద్ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా అంజన్న ఆశీస్సులను కోరారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Krithi Sanon) జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ ఏడాది జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం త్రీడీలో విడుదల కానుంది. రిలీజ్ కు రెండు నెలల సమయమే ఉండటంతో చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా సీతారాములు, లక్ష్మణ్, హనుమాన్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా దేవదత్తా నాగే నటించిన శ్రీ బజరంగ్ బలి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదే విధంగా సినిమా ప్రమోషన్స్ ను షురూ చేసిన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లోని ప్రముఖ కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయాన్ని దర్శకుడు ఓం రౌత్ (OM Raut) సందర్శించారు. ఆలయంలో అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఇక రీసెంట్ గా దర్శకుడు OM Raut, నిర్మాత Bhushan Kumar ‘ఆదిపురుష్’ కోసం జమ్మూ కాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. చిత్ర రిలీజ్ ముందు అమ్మవారిని దర్శించుకుని ప్రమోషన్స్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి వరుస అప్డేట్స్ అందిస్తున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది.
గతంలో వదిలిన ట్రైలర్ చాలా నాశిరకంగా ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆరునెలలు గ్యాప్ తీసుకొని మరింత బెస్ట్ అవుట్ పుట్ ను తీసుకొచ్చేందుకు శ్రమించారు. కానీ తాజాగా వచ్చిన రెండు పోస్టర్లకూ అభిమానులు సాటిస్ఫై కావడం లేదని తెలుస్తోంది. కనీసం మున్ముందు వచ్చే అప్డేట్స్ అయినా ఆకట్టుకుంటాయా అన్నది చూడాలి.
ఈక్రమంలోనే తాజాగా ముంబైలో ఆదిపురుష్ చిత్ర దర్శకుడు, నిర్మాతలపై కేసు కూడా నమోదైంది. ప్రముఖ హిందూ ప్రవచన కర్త సంజయ్ దినానాథ్ తివారి చిత్రంపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. శ్రీరామ నవమికి రిలీజ్ చేసిన పోస్టర్ లో శ్రీరాముడి లుక్ రామచరిత మానస్ లో రాముడి ఆహార్యం, స్వభావానికి విరుద్ధంగా ఉందని సంజయ్ పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి కొత్త విమర్శల మధ్య సినిమా రిలీజ్ ఎలా ఉండబోతుందనేది చూడాలి. చిత్రంలో సీతగా Kriti Sanon, రావణసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.