Pushpa The Rule : ‘పుష్ప’ ఎక్కడ? రేపటి అప్డేట్ పై ఆసక్తి పెంచిన సుకుమార్ టీమ్..

Published : Apr 06, 2023, 06:06 PM IST
Pushpa The Rule : ‘పుష్ప’ ఎక్కడ? రేపటి అప్డేట్ పై ఆసక్తి పెంచిన సుకుమార్ టీమ్..

సారాంశం

అల్లు  అర్జున్ ‘పుష్ప : ది రూల్’ నుంచి  రేపు బిగ్ అప్డేట్ రానుంది. ఈ సందర్భంగా  మూవీ సెట్స్ లోని కొన్ని  వర్కింగ్ స్టిల్స్ ను ఫ్యాన్స్ కోసం రివీల్ చేశారు.   

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) - క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar) కాంబోలో వస్తున్న చిత్రం ‘పుష్ప : ది రూల్’. 2021 డిసెంబర్ లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’కు ఇది సీక్వెల్.  మొదటి భాగంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుకుమార్ Pushpa2ను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్స్, బెస్ట్ విజువల్స్ ను అందించేందుకు శ్రమిస్తున్నారు. ఏడాదికి పైగా బన్నీ ఫ్యాన్స్ ను వేయిట్ చేయించిన సుక్కు ఎట్టకేళలకు రేపు బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. నిన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పుట్టిన రోజు సందర్భంగా, రేపటి బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా  ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను వదిలారు.  

తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఎక్కడున్నాడు? అంటూ అందరిలో ఆసక్తి రేకెత్తించారు. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్, ఆడియెన్స్ లో ‘Where is Pushpa?’ అనేదే ఉంది. దీంతో రేపటి  అప్డేట్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా రేపటి బిగ్ అప్డేట్ ను రివీల్ చేసే ముందుకు పుష్ప సెట్స్ లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను అభిమానులతో పంచుకున్నారు.  సెట్స్ లో సుకుమార్ అన్ని విభాగాల వారితో చర్చలు జరుపుతున్నట్టు కనిపిస్తోంది. కథ పరంగా, యాక్షన్ పరంగా, నటీనటుల పెర్ఫామెన్స్ విషయంలోనూ మరింత అవుట్ పుట్ తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. 

మరోవైపు ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్, ఫహిద్ ఫాజిల్ తో చర్చిస్తున్న స్టిల్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. రేపు సాయంత్రం 4 : 05 గంటలకు ‘పుష్ప’ ఎక్కడున్నాడనేది  రివీల్ కానుందని  తెలిపారు. రేపటి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు బన్నీ సెలబ్రేషన్స్ నూ అభిమానులు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. 

అల్లు అర్జున్ -  రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఫహిద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరింత కొంత మంది యాక్టర్స్ చేరే అవకాశం  ఉందంటున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత నవీన్ ఎర్నేని, శంకర్ రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రం తర్వాత  అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించబోతున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?