పందిపిల్ల స్టార్ హీరోలకు పోటీ ఇవ్వగలదా?

Published : Nov 06, 2018, 03:12 PM IST
పందిపిల్ల స్టార్ హీరోలకు పోటీ ఇవ్వగలదా?

సారాంశం

నటుడిగానే కాకుండా దర్శకుడిగాను టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. ఆయన చేసిన సినిమాలు చాలా వరకు ప్రయోగాత్మకంగానే ఉంటాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ అవును 2 తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు. 

నటుడిగానే కాకుండా దర్శకుడిగాను టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. ఆయన చేసిన సినిమాలు చాలా వరకు ప్రయోగాత్మకంగానే ఉంటాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ అవును 2 తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు. 

ఇక పంది పిల్లను హీరోగా చేసి అదుగో అంటూ దీపావళికి సందడి చేయనున్నాడు. అయితే బుధవారం ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో గాని గట్టి పోటీని మాత్రం ఎదుర్కోవాల్సిందే. తెలుగులో పరభాషా స్టార్ హీరోల చిత్రాలు అనువాదంగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే సర్కార్ రిలీజ్ కాగా బాలీవుడ్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ గురువారం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 

అమిర్ ఖాన్ - అమితాబ్ నటించిన ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక విజయ్ సర్కార్ తో మొదటిసారి తెలుగులో మంచి బజ్ ని క్రియేట్ చేశాడు. ఇలాంటి బడా స్టార్స్ చిత్రాల నడుమ ఒకే ఒక్క తెలుగు చిత్రంగా పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో సినిమా రిలీజ్ కానుంది. ఈ పందిపిల్ల పాజిటివ్ టాక్ ను తెచ్చుకోగలిగితేనే దీపావళి రేస్ లో ఎంతో కొంత పోటీని ఇవ్వగలదు మరి ఆ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Kota Srinivasa Rao: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు అతడెవరు ? దుమ్ము దులిపేసిన కోట శ్రీనివాసరావు
Samantha New Project: ప్రెగ్నెన్సీలోనూ సమంత డేర్‌ స్టెప్‌, ఓటీటీకి గ్రీన్‌ సిగ్నల్‌.. ఏం చేయబోతుందంటే?