Sharwanadh : శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’మూవీ ఫిబ్రవరిలోనే రిలీజ్.. ‘ఒకే ఒక జీవితం’కూడా అప్పుడే..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 28, 2022, 06:42 PM IST
Sharwanadh : శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’మూవీ ఫిబ్రవరిలోనే రిలీజ్.. ‘ఒకే ఒక జీవితం’కూడా అప్పుడే..

సారాంశం

తెలుగు ఆడియెన్స్ ను వరుస సినిమాలతో అలరిస్తున్న శర్వానంద్ తను నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కానున్నాయి. వాటిలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.   

ఫామిలీ ఓరియేంటెడ్ మూవీస్ తో దూసుకు పోతున్న టాలీవుడ్ హీరో  శర్వానంద్ ఈ ఏడాది తన ఫ్యాన్స్ ను మస్త్ ఖుషీ చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తనను నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు. 

ఇప్పటికే తన నటించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ నుంచి విడుదలైన ‘అమ్మ’ సాంగ్ ఆడియెన్స్ కు ఎంతగానో నచ్చింది. ఈ మూవీలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అక్కినేని అమల తల్లి పాత్రను పోషించింది. ఈ చిత్రంలో శర్వానంద్ కు జంటగా రితూ వర్మ ఆడిపాడనుంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా, ప్రభు ఎస్ఆర్ నిర్మాత వ్యవహించారు. అయితే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే మూవీ మేకర్స్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. కానీ పక్కా డేట్ ను మాత్రం వెల్లడించలేదు. 

 

అదేవిధంగా, శర్వానంద్ నటించిన మరో సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ మూవీని రూపొందిస్తున్నట్టు చిత్ర యూనిట్ రెండేండ్ల కిందనే ప్రకటించింది. కాగా ఎట్టకేళకు రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీలో శర్వానంద్ కు జంటగా ఆల్ ఇండియా క్రష్ ‘రష్మిక మండన్న’ నటించింది. కాగా, తిరుమల కిషోర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుజిత్ సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఒకే నెలలో శర్వానంద్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala తో వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుంది.. ట్రోల్స్ పై రీతూ చౌదరీ రియాక్షన్‌ ఇదే
BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?