SVP : ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. య్యూటూబ్, ట్విట్టర్ షేక్ అవుతాయటా..

By team teluguFirst Published Jan 28, 2022, 4:45 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న  ‘సర్కార వారి పాట’ ఫస్ట్ సింగిల్ కోసం మహేశ్  బాబు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్నసాంగ్ పై ఆశలు పెట్టుకున్నారు. 
 

షూటింగ్ జరుపుకుంటున్న ‘సర్కారు వారి పాట’ మూవీ కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ  నుంచి ఫస్ట్ సింగిల్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్టు ఇటీవల మూవీ మేకర్స్, అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా వెల్లడించారు. అయితే ఇప్పటికే మహేశ్ బాబు మూవీ థియేటర్లలోకి రావాల్సి ఉన్నా కాస్తా  ఆలస్యమైంది. దీంతో ఆయన ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు. 

ఈ క్రమంలో సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ సింగిల్ ను ఫిబ్రవరి 14కు రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి ఫిబ్రవరి 14 వరకు  17 రోజులు ఉండగా రోజులను లెక్కపెడుతూ సాంగ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ మేరకు మహేశ్ బాబు గత సినిమాల్లోని డైలాగ్స్ తో వీడియో క్రియేట్ చేసి ‘ఫస్ట్ సింగిల్’ అదిరిపోనుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థమన్ మ్యూజి క్  కొడితే దిమ్మతిరిగిపోవాల్సిందేనంటూ పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. య్యూటూబ్, ట్విట్టర్, సోషల్ మీడియా మొత్తం సాంగ్ రిలీజ్ తో దద్దరిల్లి పోవాలంటున్నారు. సాంగ్ ను విజయంతం చేసేందుకు ఇప్పటి నుంచే ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. 

 

17 Days To Go For 🥁🥁Dear Superstar Fans Get Ready With Your Youtube Accounts 🦁 pic.twitter.com/uIsYw08Eg4

— Mahesh Babu Trends 🔔 (@MaheshFanTrends)

ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ‘సర్కారు వారి పాట’ మూవీ సాంగ్స్ కంపోసింగ్ ను కూడా షూర్ చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో థమన్ ఈ మూవీకి మాస్ అండ్ మెలోడీ మ్యూజిక్  అందించే పనిలో నిమగ్నమయ్యాడు. ఇప్పటికే సర్కారు వారి పాట మూవీ టైటిల్ బీజీఎం అందిరిపోయింది. ఆడియోన్స్ కు ఎంతగానో నచ్చింది. 

బ్యాకింగ్ రంగం నేథప్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహస్తున్నారు. ఈ మూవీ ఎప్పడూ పూర్తై థియేటర్లలోకి వస్తుందా అని ఆడియేన్స్ ఎదురు చూస్తున్నారు.  

click me!