#TheKeralaStory:OTT లోకి ‘ది కేరళ స్టోరీ’అఫీషియల్ ఎనౌన్సమెంట్

By Surya Prakash  |  First Published Feb 7, 2024, 12:41 PM IST

లవ్ జిహాద్ ని లక్ష్యంగా చేసుకున్న ది కేరళ స్టోరీ ఓటిటిలోనూ మీద భారీ రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది.  



అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఈ వివాదాస్పద చిత్రం  గత ఏడాది మేలో విడుదలై సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా ఏకంగా 250  కోట్ల గ్రాస్ ని దాటేసింది. అయితే రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినా ఓటిటి రిలీజ్ అవ్వలేదు. అందుకు రకరకాల కారణాలు వినపడ్డాయి. కొద్ది కాలం క్రితం చిత్ర నిర్మాత విపుల్ షా.. తన సినిమాను ఏ ఓటీటీ కంపెనీ తీసుకోవడం లేదని, టీవీ ఛానళ్లు శాటిలైట్ రైట్స్‌ను కొనుగోలు చేయడం లేదని, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.అయితే  'ది కేరళ స్టోరీ' సినిమా డిజిటల్(The Kerala Story Digital Rights), శాటిలైట్ హక్కులను విక్రయించడానికి నిర్మాతలు భారీ మొత్తాన్ని డిమాండ్ చేయటమే అందుకు కారణం అని అన్నారు. ఇప్పుడు ఇంతకాలానికి అఫీషియల్ గా ఎనౌన్సమెంట్ వచ్చింది.

The wait is officially over! The most anticipated film is dropping soon on ZEE5! premieres on 16th February, only on pic.twitter.com/4mBGyTTp4S

— ZEE5 (@ZEE5India)

ఫిబ్రవరి 16 జీ5లో కేరళ స్టోరీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.  లవ్ జిహాద్ ని లక్ష్యంగా చేసుకున్న ది కేరళ స్టోరీ ఓటిటిలోనూ మీద భారీ రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది.  కేరళ స్టోరీ OTT హక్కులు ఇప్పటికే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ Zee5  తీసుకుంది.  మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుందని సమాచారం.  

Latest Videos

  వివాదాస్పద అంశం లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ కు  ముందే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న ది కేరళ స్టోరీ థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి సెన్సేషనే సృష్టించిందనే చెప్పాలి.  తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ప్రకటించారు.  బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతుగా నిలిస్తే, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పించాయి. 

తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రదర్శనపై అక్కడక్కడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇలా మొత్తానికి ది కేరళ స్టోరీ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఆ ఇంపాక్ట్ తో కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. మే 5న విడుదలైన ఈ మూవీకి లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా థియేటర్లలో అదరగొట్టి, అందరి నోళ్లలో నానిన ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్‌ కోసం మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

click me!