ఆసుపత్రి పాలైన నటి శ్వేత తివారీ.. షాక్‌లో అభిమానులు..

Published : Sep 29, 2021, 09:08 PM IST
ఆసుపత్రి పాలైన నటి శ్వేత తివారీ.. షాక్‌లో అభిమానులు..

సారాంశం

శ్వేత తివారీ(shweta tiwari) అనారోగ్యం పట్ల ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వరుసగా ప్రశ్నల వర్షం కురిపించగా, ఎట్టకేలకు ఆమె సన్నిహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. శ్వేత తివారీ తాజాగా తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఓ ఫోటోని పంచుకుంది.

హిందీ పాపులర్‌ టీవీ నటి శ్వేతా తివారీ ఆసుపత్రి పాలైంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే ఇంటికి వస్తారని ఆమె సన్నిహితులు వెల్లడించారు. అయితే శ్వేత తివారీ అనారోగ్యం పట్ల ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వరుసగా ప్రశ్నల వర్షం కురిపించగా, ఎట్టకేలకు ఆమె సన్నిహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. 

శ్వేత తివారీ తాజాగా తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఓ ఫోటోని పంచుకుంది. బుక్‌ పట్టుకుని ఉంది. ఇందులో ఆమె చేతికి నిడిల్‌(సూది) ఉంది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తూ అభిమానులు శ్వేతకి ఏమైందంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీనిపై ఆమె సన్నిహితులు స్పందించారు. `నటి బాగానే ఉన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆమె బలహీనత కారణంగా తక్కువ రక్తపోటుకి(లో బీపీ) గురయ్యారు.  శ్వేత షూటింగ్‌ల నిమిత్తం రెగ్యూలర్‌గా ప్రయాణిస్తుంది. దాని కారణంగానే బలహీనంగా ఉంది. అయితే ఇప్పుడు బాగానే ఉంది. శ్వేత తివారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని ఆమె టీమ్‌ వెల్లడించింది. 

శ్వేత తివారీ స్టంట్‌ బేస్డ్ రియాలిటీ షో `ఖత్రోన్‌ కే ఖిలాడీ 11` షో పాల్గొంటుంది. ఈ షో కోసం ఆమె బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తుంది. దానివల్లే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందట. అయితే ఆమె పంచుకున్న ఫోటోలు, వీడియోలో శ్వేతతోపాటు దివ్యాంక త్రిపాఠి కూడా ఉన్నారు. ఆమె శ్వేత తివారీ కళ్లు నొక్కుతున్నట్టు కనిపించారు. 

శ్వేత తివారీ మొదట రాజా చౌదరిని పెళ్లి చేసుకుంది. ఆయనకు విడాకులిచ్చాక.. మూడేళ్ల డేటింగ్‌ తర్వాత 2013లో నటుడు అభినవ్‌ కోహ్లీని పెళ్లి చేసుకున్నారు. 2016లో అభినవ్‌, శ్వేత లకు కుమారుడు రేయాన్ష్‌ జన్మించారు. 2019 ఆగస్ట్ లో తన రెండోవ భర్త అభినవ్‌ కోహ్లీపై శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని బాగా హింసిస్తున్నాడని, వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా