రూమర్లకి చెక్‌.. `రాధేశ్యామ్‌` రిలీజ్‌ డేట్‌పై మరోసారి క్లారిటీ..

Published : Sep 29, 2021, 05:53 PM IST
రూమర్లకి చెక్‌.. `రాధేశ్యామ్‌` రిలీజ్‌ డేట్‌పై మరోసారి క్లారిటీ..

సారాంశం

ప్రభాస్‌(prabhas) హీరోగా రూపొందుతున్న `రాధేశ్యామ్‌`(radheshyam) సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR movie) సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుందని దీంతో  ఫెస్లివల్‌ మూవీస్‌ వాయిదా పడుతున్నాయని ఓ వార్త వైరల్‌ అవుతుంది.

ప్రభాస్‌ నుంచి ఇమీడియట్‌గా రాబోతున్న పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. దీన్ని వచ్చే సంక్రాంతికి జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ ప్రకటించాయి. ప్రస్తుతం థియేటర్‌కి ఆశించిన స్థాయిలో ఆడియెన్స్  రాలేకపోతున్న నేపథ్యంలో సంక్రాంతిని టార్గెట్‌ చేశారు నిర్మాతలు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుందని, దీంతో ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న ప్రభాస్‌ రాధేశ్యామ్‌, మహేష్‌ `సర్కారు వారి పాట`, పవన్‌ `భీమ్లా నాయక్‌` చిత్రాలను పోస్ట్ పోన్‌ చేయించే పనిలో ఉన్నారని, ప్రస్తుతం దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్‌ స్పందించింది. సినిమా అనుకున్న డేట్‌కే వస్తుందని, ఇతర ఎలాంటి ప్రభావాలు సినిమా విడుదలపై లేవని తెలిపింది. జనవరి 14నే రిలీజ్‌ చేయబోతున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. ఈ సినిమా తెలుగు, హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరిగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రభాస్‌, పూజా హెగ్డేల కెమిస్ట్రీ బాగా పండిందని ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ని బట్టి అర్థమవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?