పక్షవాతానికి గురైన సినీ నటి

Published : Dec 12, 2020, 08:52 AM IST
పక్షవాతానికి గురైన సినీ నటి

సారాంశం

పక్షవాతం వలన శిఖా మల్హోత్రా కుడి కాలు మరియు చేయి పని చేయడం లేదని సమాచారం. శిఖా పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను విల్లెపార్లే లోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. పక్షవాతం కారణంగా ఆమె శరీరం పూర్తిగా ప్రభావితం అయినట్లు ఆమె పి ఆర్ మరియు మేనేజర్ అయిన అశ్వని శుక్లా తెలియజేశారు. 

 
నర్సింగ్ లో డిగ్రీ చేసిన శిఖా మల్హోత్రా  నెలల తరబడి కోవిడ్ రోగులకు సేవలు అందించారు. ఈ క్రమంలో అక్టోబర్ లో శిఖా మల్హోత్రా కరోనా బారిన పడడం జరిగింది. ఈ విషయాన్ని శిఖా మల్హోత్రా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కరోనా నుండి కోలుకున్న శిఖా రెండు నెలల తరువాత పక్షవాతానికి గురికావడం జరిగింది. 
 
షారుక్ ఖాన్ నటించిన ఫ్యాన్ మూవీలో శిఖా మల్హోత్రా కీలక రోల్ చేయడం జరిగింది. శిఖా ఆరోగ్య పరిస్థితి తెలుకున్న ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. శిఖా త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. 2020 ఎన్నడూ లేని విధంగా అనేక మంది నటుల కుటుంబాలలో విషాదం నింపిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య