'జబర్దస్త్'లో ట్విస్ట్.. మీనా స్థానంలో మరో సెలబ్రిటీ!

Published : May 14, 2019, 03:05 PM IST
'జబర్దస్త్'లో ట్విస్ట్.. మీనా స్థానంలో మరో సెలబ్రిటీ!

సారాంశం

తెలుగులో బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ షోకి ఇప్పటివరకు నాగబాబు, రోజాలు జడ్జిలుగా వ్యవహరించారు. 

తెలుగులో బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ షోకి ఇప్పటివరకు నాగబాబు, రోజాలు జడ్జిలుగా వ్యవహరించారు. అయితే ఈ ఇద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయడంతో జబర్దస్త్ షోకి కాస్త గ్యాప్ ఇచ్చారు. దీంతో షో నిర్వహకులు శేఖర్ మాస్టర్, నటి మీనాలను తీసుకొచ్చారు.

ఇప్పుడు మళ్లీ రోజా రీఎంట్రీ ఇచ్చి షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. నాగబాబు కూడా త్వరలోనే షోలో పాల్గొంటానని చెప్పారు. అయితే తాజాగా ఈ షోలో మరో సెలబ్రిటీ జడ్జి దర్శనమిచ్చింది. ఆమె మరెవరో కాదూ.. సీనియర్ హీరోయిన్ సంఘవి. రోజాతో కలిసి సంఘవి జబర్దస్త్ షో జడ్జిగా వ్యవహరించారు.

చూస్తుంటే మీనా స్థానంలో సంఘవిని తీసుకొచ్చినట్లుగా అనిపిస్తోంది. కన్నడకి చెందిన సంఘవి పదిహేనేళ్ల క్రితం హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. దాదాపు అప్పటి అగ్ర  హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున వంటి స్టార్ల సరసన నటించి మెప్పించింది.

మళ్లీ ఇంతకాలానికి 'జబర్దస్త్' షోలో కనిపించి షాక్ ఇచ్చింది. నాగబాబు రీఎంట్రీ ఇచ్చేవరకు సంఘవిని కంటిన్యూ చేస్తారని అంటున్నారు. తాజాగా విడుదల చేసిన 'జబర్దస్త్' ప్రోమోలో సంఘవి చేసిన సందడి ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా