అఖిల్ చిత్రానికి అంతా అదుపులోనే!

Siva Kodati |  
Published : May 14, 2019, 02:26 PM IST
అఖిల్ చిత్రానికి అంతా అదుపులోనే!

సారాంశం

అక్కినేని వారసుడు అఖిల్ కు సక్సెస్ దూరం జరుగుతూనే ఉంది. 'అఖిల్' చిత్రంతో టాలీవుడ్ లోకి అఖిల్ గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

అక్కినేని వారసుడు అఖిల్ కు సక్సెస్ దూరం జరుగుతూనే ఉంది. 'అఖిల్' చిత్రంతో టాలీవుడ్ లోకి అఖిల్ గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత 'హలో' రూపంలో ప్రేమ కథ ప్రయత్నించాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేమ, కుటుంబ కథ అంశాలు ఉన్నపటికీ ఈ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. 

వరుస మూడు పరాజయాల నుంచి తేరుకుని అఖిల్ నాల్గవ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. బొమ్మరిల్లు, పరుగు చిత్రాలతో ఒక్కసారిగా అందరిదృష్టిని బొమ్మరిల్లు భాస్కర్ ఆకర్షించారు. ఆ తర్వాత ఆరెంజ్, ఒంగోలు గిత్త లాంటి డిజాస్టర్లతో భాస్కర్ అవకాశాలు కోల్పోయారు. మరోమారు ఈ దర్శకుడు తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. అఖిల్ నాల్గవ చిత్రానికి ఇతడే దర్శకుడు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది. దీనితో ఈ దరి భాస్కర్ బలమైన కథతోనే వస్తున్నాడనే అంచనాలు మొదలయ్యాయి. అల్లు అరవింద్ మాత్రం ఈ చిత్రానికి బడ్జెట్ అదుపులో ఉండాలని భాస్కర్ కు సూచించినట్లు తెలుస్తోంది. 20 కోట్లకు బడ్జెట్ మించకూడదని కండిషన్ పెట్టారట. తక్కువ బడ్జెట్ లో చిత్రాలు చేయడంలో భాస్కర్ కు అనుభవం ఉంది. 

బొమ్మరిల్లు, పరుగు చిత్రాలని గమనిస్తే అందులో భారీ స్థాయిలో ఖర్చయ్యేంత హంగామా కనిపించదు. కానీ ఆరెంజ్ చిత్రానికి వచ్చే సరికి అంచనాలు పెరిగిపోవడంతో అనవసరమైన ఖర్చుకు పోయి పొల్తాపడ్డారు. అఖిల్ చిత్రాన్ని సింపుల్ కథతో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ లిమిట్ లో ఉంచుకుని కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నారట. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా