ఎక్స్ పోజింగ్ చేస్తే తప్పేంటి..? నటి కామెంట్స్!

Published : May 13, 2019, 10:37 AM IST
ఎక్స్ పోజింగ్ చేస్తే తప్పేంటి..? నటి కామెంట్స్!

సారాంశం

తమిళంలో అంబులి, విలాసం, మాయై వంటి చిత్రాల్లో నటించిన భామ సనం శెట్టి ఇప్పుడు 'టికెట్' అనే మరో సినిమాలో నటిస్తోంది. 

తమిళంలో అంబులి, విలాసం, మాయై వంటి చిత్రాల్లో నటించిన భామ సనం శెట్టి ఇప్పుడు 'టికెట్' అనే మరో సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. గ్లామర్ గా నటించడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతోంది ఈ బ్యూటీ. 

తనకు తెలిసినంత వరకూ సినిమా, వెబ్ సిరీస్ వేరు కాదని.. ఇప్పుడు అంతా ఒక్కటిగా మారిపోయిందని చెప్పింది. కానీ సినిమాలు విడుదలయ్యే ప్లాట్ ఫాం మారిందని అంతేనని తెలిపింది.

సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఉండడం వలన అందాల ఆరబోత ఎక్కువైతే వెంటనే కత్తెర పడుతుందని, కొన్ని సన్నివేశాలను మ్యూట్ కూడా చేస్తారని.. కానీ వెబ్ సిరీస్ లకు ఇలాంటి  అడ్డు ఉండదని చెప్పుకొచ్చింది.

కథకు అవసరమైతే గ్లామర్ గా నటించవచ్చని.. అందుకే వెబ్ సిరీస్ లో గ్లామర్ తో పాటు యువతను ఆకట్టుకునే డైలాగులు కూడా ఉంటాయని.. అయినా ఎక్స్ పోజ్ చేసి  నటించడం తప్పేముందని ప్రశ్నించింది. కథకు అవసరమైతే గ్లామర్ గా నటించడానికి ఎంతమాత్రం వెనుకాడనని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

సాయి పల్లవి సీక్రెట్.. పొట్టి బట్టలు వేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
మహేష్ బాబు నమ్మి అవకాశం ఇస్తే.. నిండా ముంచిన డైరెక్టర్లు ఎవరో తెలుసా?