అజిత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Published : May 13, 2019, 10:17 AM IST
అజిత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయంపై అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంటుంది.

సినిమా ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయంపై అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంటుంది. అయితే ఈ విషయాలను బయటకి రానివ్వరు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు రూ.15 నుండి రూ.20 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.

కానీ కోలివుడ్ హీరోల విషయంలో అలా కాదు. రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ లాంటి హీరోలు ఒక్కో సినిమాకు రూ.40 నుండి రూ.50 కోట్ల వరకు తీసుకుంటారని కోలివుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు.. సినిమా కలెక్షన్స్, బడ్జెట్ ని బట్టి కూడా రెమ్యునరేషన్ మారుతుంది.

అయితే వరుసగా నాలుగు హిట్ సినిమాలను అందించిన హీరో అజిత్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే విషయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 'విశ్వాసం' సినిమా తరువాత బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ 'నేర్ కొండ పార్వై' అనే సినిమాలో నటించమని అజిత్ కి భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ సినిమా కోసం అతడికి రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం కోలివుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.  

PREV
click me!

Recommended Stories

Ileana: పోకిరి కంటే ఆ మూవీనే స్పెషల్.. పవన్ తో కాలేజ్ సీన్లు, అవి నా రియల్ లైఫ్ లో జరిగాయి
Sameera Bharadwaj Remuneration: సింగర్‌ సమీరా భరద్వాజ్‌ ఒక్కో పాటకి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?