మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కాదు.. వర్మ కామెంట్స్!

Published : Feb 13, 2019, 11:57 AM IST
మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కాదు.. వర్మ కామెంట్స్!

సారాంశం

ఎన్టీఆర్ అబద్ధపు అభిమనులందరినీ రేపు పొద్దున్నే తమ ఇళ్లకు దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామీ గుడికి వెళ్లి ఆకు పూజ చేసి రెడీగా ఉండమని చెబుతున్నాడు వర్మ. 

ఎన్టీఆర్ అబద్ధపు అభిమనులందరినీ రేపు పొద్దున్నే తమ ఇళ్లకు దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామీ గుడికి వెళ్లి ఆకు పూజ చేసి రెడీగా ఉండమని చెబుతున్నాడు వర్మ.

వర్మ ఎందుకు ఇలా అంటున్నాడంటే ఆయన రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా టీజర్ ని ప్రేమికుల రోజు సందర్భంగా రేపు విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంటుందని అంటున్నాడు వర్మ. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

''ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. 9:27AM కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు'' అంటూ రాసుకొచ్చాడు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్ కోసం మొదటి నుండి కూడా తన ట్విట్టర్ అకౌంట్ ని విపరీతంగా వాడుకుంటున్నాడు వర్మ. నిన్న లక్ష్మీపార్వతి వెళ్లి మోదీని కలిస్తే అది కూడా తన సినిమా ప్రమోషన్ కోసం వాదేసుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్