
చాలా కాలంగా భర్త పోయిన బాధలో మునిగిపోయి ఉంది హీరోయిన్ మీనా. సినిమాలు చేస్తూ వస్తున్నా.. పెద్దగా యాక్టీవ్ గా అనిపించలేదు. ఏదో షూటింగ్ చేసుకోవడం ఇంటికి వెళ్లిపోవడం తప్పించి..ఎవరితో పెద్దగా కలవలేదు మీనా. ఒక రకంగా చాలా కాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది సీనియర్ హీరోయిన్. అయితే మీనా కోసం తన తోటి హీరోయిన్లు చాలా మంది వెన్నంటే ఉన్నారు. ఎప్పుడూ ఆమె ఇంటికి వెళ్తూ.. ఆమెకు దైర్యం చెపుతూ.. ఆమెను మళ్ళీ సార్మల్ చేయడంకోసం ప్రయత్నించారు. ప్రస్తుతం ఆమె ఆ విషాదం నుంచి బయటపడుతున్నారు.
ఈక్రమంలో మీనా డాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. హీరోయిన్ సంఘవితో కలిసి మీనా కాలు కదిపారు. అదిరిపోయే స్టెప్పులేస్తూ.. కనిపించింది. విశాల్ నటించిన ఎనిమీ మూవీలో టమ్ టమ్ పాటకు సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టేప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియో చూసిన మీనా అభిమానులు ఫుల్ కుషీ అవుతున్నారు. అంతే కాదు విషాదం నుంచి కోలుకుని హ్యాపీగా కనిపించినందకు మీనాను అభినందిస్తున్నారు. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
లాస్ట్ ఇయర్ మోహన్ బాబు జోడీగా సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కనిపించింది మీనా. ఇక విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన దృశ్యం, దృశ్యం 2 మూవీతో మంచి ఫామ్ లోకి వచ్చింది. భర్త మరణం తరువాత చాలా గ్యాప్ ఇచ్చిన మీనా ప్రస్తుతం తమిళంలో రౌడీ బేబీ , మలయాళంలో జనమ్మ డేవిడ్ మూవీలో నటిస్తుంది.
మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది మీనా. బెంగళూరుకు చెందిన బిజినెస్ మెన్ విద్యాసాగర్‌ను 2009 జూలై 12న పెళ్లాడింది మీనా. వీరిద్దరికి ఓ పాప పాప ఉంది ఆమె పేరు నైనిక. మీనా మాదిరిగానే నైనికా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాలో బాలనటిగా పరిచయం అయ్యింది. తెలుగులో ఈసినిమా పోలీస్ పేరుతో రిలీజ్ అయ్యింది. ఇక మీనా భర్త విద్యాసాగర్.. శ్వాస సంబంధిత వ్యాధితో లాస్ట్ ఇయర్ మరణించారు. అప్పటి నుంచి మీనా కొంతకాలం డిప్రేషన్ లోకి వెళ్లింది. కొంతకాలం వరకు మీడియా ముందుకు కూడా రాలేదు.