సింగర్ చిన్మయి పిల్లలతో సరదాగా సమంత.. వైరల్ గా మారిన వీడియో

Published : Aug 07, 2023, 04:55 PM ISTUpdated : Aug 07, 2023, 05:00 PM IST
సింగర్ చిన్మయి పిల్లలతో సరదాగా సమంత.. వైరల్ గా మారిన వీడియో

సారాంశం

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా పంచుకున్న వీడియోలు వైరల్ గా మారాయి.  పిల్లలతో కలిసి సామ్ సరదాగా కనిపించడంతో పాటు సంతోషంగా చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.   

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha) ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాన్ని తన ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నట్టు కూడా చెప్పింది. ఈ సందర్భంగా సామ్ పలు దేవాలయాలు, వేకేషన్లకు వెళ్తూ రిలాక్స్ అవుతోంది. ఎక్కువగా నేచర్ కు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజంతా గడుపుతూ ఎనర్జీని పొందుతోంది.

మొన్నటి వరకు ఇండోనేషియాలో సందడి చేసిన సామ్ తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఎప్పటి కప్పుడు ఫొటోలు, బ్యూటీఫుల్ లోకేషన్లకు సంబంధించిన డిటేయిల్స్ ను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక సిటీకి తిరిగి వచ్చిన సామ్ ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోలను అభిమానులతో పంచుకుంది. పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంంటూ కనిపించింది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద మరియు దర్శకుడు-నటుడు రాహుల్ రవీంద్రన్ దంపతులకు కవల పిల్లలు శ్రావస్ మరియు ద్రిప్తా  ఉన్నారు. తాజాగా వారి ఇంటికి వెళ్లిన సామ్ పిల్లలతో కలిసి ఆడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలనే తాజాగా ఫ్యాన్స్ తోనూ షేర్ చేసుకుంది. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు సాంగ్ కు పిల్లాడితో స్టెప్పులు వేయిస్తూ హుషారుగా కనిపించింది. కిడ్స్  ఆడుతూ హ్యాపీగా కనిపించింది. 

సామ్ ను ఆనందంగా చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె అల్లరి పనులకూ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. సామ్ నటించిన రెండు ప్రాజెక్ట్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తొలుత విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఖుషి’ రాబోతోంది.సెప్టెంబర్  1న థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత హిందీలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘సిటడెల్’తో అలరించనుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా