ఆ ఒక్కటి సరిగా లేదని స్టార్ హీరో సినిమా నుండి తప్పించారు

Published : Aug 07, 2023, 04:35 PM IST
ఆ ఒక్కటి సరిగా లేదని స్టార్ హీరో సినిమా నుండి తప్పించారు

సారాంశం

ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇవాన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాను ఎత్తు తక్కువగా ఉండటం వలన అనేక అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది ఈ చిన్నది.

తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న "లవ్ టుడే" సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం ఐదు కోట్ల ఖర్చుతో ఈ సినిమాను నిర్మిస్తే ఒక్క తమిళ్ లో దాదాపు 60 కోట్లు వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇవాన కు కూడా మంచి గుర్తింపు రావడమే కాకుండా ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది.

మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ సంస్థ లో వచ్చిన మొదటి సినిమా LGM లో ఇవాన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇవాన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాను ఎత్తు తక్కువగా ఉండటం వలన అనేక అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. కన్నడ పరిశ్రమలో ఒక పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఆ హీరో పక్కన నేను ఎత్తు సరిపోలేదని ఆఖరి నిమిషంలో నన్ను రిజెక్ట్ చేశారు. దీంతో చాలా బాధపడ్డాను. కేవలం ఇక్కడే కాదు లవ్ టుడే సినిమా సమయంలో కూడా నేను బాడీ షేమింగ్ అవమానాలు ఎదుర్కొన్నాని, చాలా మంది శారీరక రూపం గురించి ఎందుకు మాట్లాడుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

నా చిన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు విన్నాను. నేను పొట్టిగా ఉన్నానని అందరూ అంటారు. స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. స్కూల్ లో అసెంబ్లీ అప్పుడు నన్ను ముందు వరసలో నిలబెట్టేవాళ్ళు. దానికి కారణం నేను పొట్టిగా ఉండటం. అదంతా నాకు చిన్నతనంలోనే అలవాటు అయ్యింది. ఒక్కోసారి స్నేహితులు కూడా ఎగతాళి చేసినప్పుడు దాని ప్రభావం రోజంతా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది ఇవాన.

ఇక ఇవాన తదుపరి సినిమా విషయానికి వస్తే దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన 7/జి బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. 7 జి సినిమా హీరో రవి కృష్ణ తిరిగి ఈ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.  సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇవాన ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఒక్కప్పటి సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో లవ్ టుడే బ్యూటీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా