తమన్నా, త్రిష.. ఒకే స్టార్‌ హీరోతో రొమాన్స్..

Published : Aug 07, 2023, 04:30 PM IST
తమన్నా, త్రిష.. ఒకే స్టార్‌ హీరోతో రొమాన్స్..

సారాంశం

ఇద్దరు అందాల భామలు కలిసి నటించబోతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మరో స్టార్‌ హీరోయిన్ త్రిష కలిసి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకే స్టార్‌ హీరోతో రొమాన్స్ కి రెడీ అవుతున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా, సీనియర్‌ బ్యూటీ త్రిష కలిసి ఇప్పుడు ఒకే హీరోతో రొమాన్స్ కి సిద్ధమవుతున్నారు. స్టార్‌ హీరోతో ఆడిపాడబోతున్నారు. మరి ఆ వివరాలు చూస్తే.. తమన్నా ప్రస్తుతం `జైలర్‌`, `భోళా శంకర్‌` చిత్రాల్లో నటించింది. ఈ వారంలో ఈ రెండు సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. మరోవైపు త్రిష చివరగా `పొన్నియన్‌ సెల్వన్‌ 2`లో నటించింది. మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

అయితే ఈ ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తున్నారు. అది అజిత్‌ లాంటి స్టార్‌ హీరోతో కలిసి నటించబోతుండటం విశేషం. తాజాగా ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అజిత్‌ సంక్రాంతి..  `తునివు` చిత్రంతో ఆడియెన్స్ కి వచ్చారు. ఈ సినిమా డీసెంట్‌ హిట్‌ని సొంతం చేసుకుంది. కొన్న వారంతా సేఫ్‌  జోన్‌కి చేరుకున్నారని సమాచారం. 

నెక్ట్స్ అజిత్‌.. మ్యాజిక్స్ తిరుమేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. మొదట ఈ చిత్రానికి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ క్రియేటివ్‌ డిఫరెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు విఘ్నేష్‌ తప్పుకున్నారు. ఆ స్థానంలో మ్యాజిక్స్ తిరుమేని వచ్చారు. ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యింది. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపిక జరుగుతుంది. 

అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉందట. ఇద్దరు భామలకు స్కోప్‌ ఉందని, దీంతో స్టార్‌ హీరోయిన్లని తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు తమన్నా, త్రిషల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఫిక్స్ అని అంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోయిన్లు అజిత్‌తో సినిమాలు చేశారు. తమన్నా `వీరం` సినిమాలో నటించింది. ఇక త్రిష..`జీ`, `కిరీడమ్‌`, `మంకత`, `యెన్నై అరిందాల్‌` వంటి చిత్రాల్లో నటించారు. మంచి హిట్‌ పెయిర్‌గానూ నిలిచారు.

ప్రస్తుతం త్రిష నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. అలాగే తమన్నా సైతం సీనియర్‌ హీరోలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇటీవల బోల్డ్ వెబ్‌ సిరీస్‌లలో నటించి షాకిచ్చింది. ఇంటెన్స్ సీన్లు, బెడ్‌ సీన్లు చేసి ఆకట్టుకుంది. అందరికి మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఇక ఈ వారం బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో రాబోతుంది.  చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రం చేసింది. రజనీకాంత్‌తో `జైలర్‌` మూవీలో నటించింది.  ఆగస్ట్ 10న `జైలర్‌`, ఆగస్ట్ 11న `భోళా శంకర్‌` మూవీ రిలీజ్‌ కానుంది. మరి ఏమేరకు అలరిస్తుందో చూడాలి. 


 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్