Ranya Rao Case: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావ్ బెయిల్ పిటిషన్‌ను ఆర్థిక నేరాల కోర్టు కొట్టిపారేసింది.
Ranya Rao Case: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావ్ బెయిల్ పిటిషన్‌ను ఆర్థిక నేరాల కోర్టు కొట్టిపారేసింది. రన్యా రావ్ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్‌ను జడ్జి విశ్వనాథ్ సి.గౌడర్ తిరస్కరించారు. రన్యా 2024లో 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందని, ఆమె దగ్గర దుబాయ్ రెసిడెన్స్ ఐడీ కూడా ఉందని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు దర్యాప్తు అధికారుల దగ్గర ఉన్నాయని తెలిపారు. రన్యా స్మగ్లింగ్ చేసిన బంగారం విలువ రూ.4.83 కోట్లు ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసుకి సంబంధించి రన్యా రావ్‌కి అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ కేసులో ఆరోపణలు చాలా సీరియస్‌గా ఉన్నాయి, ఇంకా దర్యాప్తు ప్రారంభదశలోనే ఉంది. ఈ టైమ్‌లో ఆమె బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అందుకే బెయిల్ ఇవ్వలేమని జడ్జి చెప్పారు. విచారణ సమయంలో రన్యా లాయర్ మాట్లాడుతూ.. అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో మెమోలో తెలపలేదని అన్నారు.
అరెస్ట్ చేసిన వెంటనే కస్టమ్స్ అధికారి ముందు హాజరు పరచలేదు. కస్టమ్స్ రూల్స్‌ను కూడా ఫాలో అవ్వలేదు. ముగ్గురిలో రన్యాను మాత్రమే అరెస్ట్ చేశారు. ఆమె బాడీలో, షూలో, ప్యాకెట్‌లో బంగారం ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ మెటల్ డిటెక్టర్‌లో ఏం కనపడలేదు. డీఆర్‌ఐ అధికారులు చాలా తప్పులు చేశారు. రన్యా ఒక మహిళ కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరారు.
డీఐఆర్ లాయర్ వాదిస్తూ.. దుబాయ్ నుండి 14.200 కేజీల 24 క్యారెట్ల బంగారాన్ని తీసుకొస్తుండగా మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డారు. బంగారాన్ని ఇండియాకు తెచ్చేటప్పుడు దుబాయ్‌లో అబద్ధాలు చెప్పి అక్కడి అధికారులను తప్పుదోవ పట్టించారు. ఇది ముందుగా ప్లాన్ చేసుకున్న పని. రన్యాకు ఇలాంటి స్మగ్లింగ్ హిస్టరీ ఉంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. ఇంకా దర్యాప్తు జరుగుతోంది, స్మగ్లింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి. అందుకే రన్యాకు బెయిల్ ఇవ్వకూడదని డీఐఆర్ అధికారులు వాదించారు.
also read: ఆస్కార్ అవార్డులపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్, 200కోట్లు ఇస్తా తెప్పించండి