Tollywood: ప్రపంచానికి తెలియని ఎంతో మంది ఉదయ్‌ కిరణ్‌లు.. నటీనటుల జీవితాల్లో ట్రాజెడీలకు కారణం ఏంటి.?

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. అత్యధిక రెమ్యునరేషన్లు, విలాసవంతమైన జీవితమే గుర్తొస్తుంది. అయితే సెలబ్రిటీల జీవితాల వెనక ఎన్నో ట్రాజడీలు ఉంటాయి. ఇంతకీ వీటి వెనకాల అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

The Dark Side of Fame Forgotten Actors, Social Media Fame The Tragedy of Modern Glamour Dreams details in telugu

ఉదయ కిరణ్ .. ఆర్తి అగర్వాల్ .. దివ్య భారతి .. సిల్క్ స్మిత .. ప్రత్యూష .. ఫటాఫట్ జయలక్ష్మి .. గుర్తున్నారా ? మహానటి సావిత్రి , శ్రేదేవి , రాజనాల , హరినాథ్ , మార్లిన్ మన్రో , మీనా కుమారి , పర్వీన్ బాబి, మధుబాల , జియా ఖాన్ , సుశాంత్ సింగ్ రాజపుట్ .. ఎలా మరణించారో  తెలుసా ? రీమా సేన్ , సోనాలి బెంద్రే , ఛార్మి  కౌర్ , జెనీలియా , కమలిని ముఖర్జీ , మధు షాలిని , కాజల్ అగర్వాల్ , బిందు మాధవి ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా ? ఒక సినిమా వండర్ లు .. వెంకట్ , దీపక్,  ఆకాష్,  యశో సాగర్,  రోహిత్,  సచిన్ జోషి,  రాజా...  గుర్తున్నారా ?

లైఫ్ ను బాగా ప్లాన్ చేసుకొన్న కొంత మంది మినహాయించి .. వెండి తెర నటీ  నటుల జీవితాలు ట్రాజెడీ . బుల్లి తెర జీవితాలు మరింత ట్రాజెడీ . టెలివిషన్ నటీ నటుల సంపాదన తక్కువ .  స్క్రీన్ లైఫ్ మరింత తక్కువ . సుమ...  ప్రదీప్ మాచిరాజు లాంటి కొన్ని మినహాయింపులు సరే . మిగతావారి జీవితాలు ? డబ్బు లేదని ఉదయ కిరణ్ అత్మ్య హత్య చేసుకున్నాడా ?  హీరో రాజశేఖర్ నేటి మానసిక స్థితి ఏంటి ? ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి అటుపై ఫేడ్ అవుట్ అయిపోతే కలిగే మానసిక సంఘర్షణ గురించి మీకు తెలుసా ? సినిమాల్లో ఛాన్స్ కోసం సర్కార్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కి .. అటుపై .. ముంబై...  గోవా రెడ్ లైట్ ఏరియాల్లో మగ్గిన  జీవితాలు ఎన్నో. ఇది చరిత్ర . 

Latest Videos

ఇప్పుడు వర్తమానం !  రెండేళ్ల క్రితం ఒక వ్యక్తి  తిరుపతి లో తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురుని నా దగ్గరకు కౌన్సిలింగ్ కోసం తెచ్చాడు. "కష్టపడి చదివితే .. మరో పదేళ్ళకు లక్ష జీతం వస్తుందేమో . ఇప్పుడే నెలకు రెండు లక్షలు సంపాదిస్తా "అంది ఆ అమ్మాయి. స్కూల్ కు పోవడం ఆపేసింది . క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్‌కు, జిమ్‌కు వెళ్తుంది.  రీల్స్ చూస్తూ .. రీల్స్ చేస్తూ కాలం గడుపుతోంది .
ఈ రెండేళ్లలో ఇలాంటి వారి సంఖ్య ఇబ్బుడిముబ్బుడిగా పెరిగి పోయింది. 

కొంత మంది తల్లితండ్రులయితే తామే పిల్లల్ని ఈ రంగంలోకి దించుతున్నారు. రీల్స్ చేస్తూ డబ్బు గడిస్తున్నారు. మహేష్ బాబు కుమార్తె సితార పన్నెండేళ్ళకే మోడలింగ్ లో కోటి సంపాదించింది.  సితారకు మంచి భవిషత్తు ఉంది.  రెండు తరాల నట వారసత్వం . ఆమెకు అభినందనలు . సితార లాంటి అమ్మాయిలు .. అబ్బాయిలు ఎంతో మంది . కోటి వద్దు . మోడలింగ్ లో లక్ష ఇప్పించండి... చూద్దాము . సితార  మహేష్ బాబు కూతురు , ఆమె వెనక తల్లి నమృత ప్లానింగ్ ఉంది.  సితార చదువు పక్కన పెట్టి మోడలింగ్ చేయలేదు .. డబ్బు ... నట వారసత్వం సరి పొతే నాగార్జున కుమారుడు అఖిల్ ఎందుకింత కష్టపడుతున్నాడు ? బ్రహ్మానందం లాంటి ఎంత మంది నటుల పిల్లలు గ్లామర్ ఫీల్డ్ లో ఫెయిల్ కాలేదు ? వెండి తెర , బుల్లి తెర...  సంగతి వేరు . సోషల్ మీడియా అయితే అవకాశం కోసం ఎదురు చూడనక్కర లేదు . ఒక సెల్ ఫోన్ ఉంటే తనకు తానే బ్రేకింగ్ ఇచ్చుకోవచ్చు. స్క్రీన్ టెస్ట్ లు .. ఆడిషన్ లు అక్కరలేదు .

శుక్రాచార్యలు ఉంటారు జాగ్రత్త: 

రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు . సమాజంలో జరిగే ప్రతి అడ్డమయిన పనిని .. ఆధునికత....  కొత్త తరం  ...  సరి కొత్త ఆలోచనలు...  లింగసమానత్వం అనే లేబుళ్ల తో సమర్తించే  శుక్రాచార్యులు నేడు ఎంతో మంది. "ఏముందండీ క్రియేటివ్ స్కిల్స్ ఉన్నోళ్లు సోషల్  మీడియా లో .. రాణిస్తారు .  అయినా పిల్లల కెరీర్ వారిష్టం . పేరెంట్స్ ఎవరు? ...  అది వద్దు .. ఇది వద్దు అని చెప్పడానికి?"  అని వీరు తమ తెలివి తేటలతో  జనాల్ని కన్ఫ్యూజ్  చేసేస్తారు. పిల్లల ఆప్టిట్యూడ్ ముఖ్యమే .. కానీ ఎలాంటి రంగం ఎంపిక చేసుకొంటున్నాము అనేది ముఖ్యం కదా ? మొగమాటం లేకుండా మాట్లాడుకొందాము . సోషల్ మీడియా లో హిట్ అయ్యి డబ్బులు సంపాదించాలి అంటే కావాల్సిన అర్హతలు ఏంటి ? ఎక్స్‌పోజ్‌, బూతులు  మాట్లాడాలి,  ఆడామగా కాని వాయిస్ తో మాట్లాడాలి .లేదా వికార వికృత చేష్టలు చెయ్యాలి.  నెమలి కూర వండడం .. బెట్టింగ్ అప్స్ ను ప్రమోట్ చేయడం లాంటివి చేసి ఇటీవలే కటకటాలు పాలయిన వారున్నారు .  ఈ పనులు చేయకుండా పాజిటివ్ కంటెంట్‌తో.. క్రియేటివిటీతో ..  సోషల్  మీడియాలో హిట్ అయినవారిని చూపండి . ఆగండాగండి ఎక్కడో లక్ష కు ఒక మినహాయంపు ఉంటే దాన్ని హై లైట్ చేయకండి . నేను మాట్లాడుతున్నది తొంబై  తొమ్మిది  పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం గురించి.

సోషల్ మీడియా స్టార్ల సంగతి ఏంటి.? 

మహా  మహా...  అనుష్క...  ఇలియానా...  జెనీలియా లాంటివారు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇక సోషల్ మీడియా స్టార్స్ సంగతి ? రెండేళ్లు .. పోనీ నాలుగేళ్లు .. జనాలకు నీ  మొఖం  బోర్ కొట్టేస్తుంది . ఈ లోగా నీ కంటే బాగా విప్పి చూపించేవారు .. కొత్త  బూతులు మాట్లాడేవారు వచ్చేస్తారు . నీ వ్యూస్ పడిపోతుంది . ఆదాయం అడుగంటి పోతుంది . అటు పై అడుక్కు తిని బతుకుతావా?
స్వాతి నాయుడు  .. టీవీ చానెల్స్ లో చిన్నా చితకా ప్రోగ్రామ్స్ కు యాంకర్ . అక్కడ అవకాశాలు సన్నగిల్లితే పోర్న్ నటిగా మారింది . నలబై వయసు దగ్గరబడుతోంది . శరీరం జనాలు కోరుకొనే అందాన్ని కోల్పోయింది . ఇప్పుడు బూతుల వీడియోలు వదులుతోంది . బూతుల మాటల ఆదాయం మరో నాలుగేళ్లు . అటు పై  ? యు  ట్యూబ్ చానెల్స్ లో నాలుగేళ్ళ క్రితం లక్షల వ్యూస్ సాధించిన స్టార్స్.. దుబాయి పాప .. తార్నాక పాలు ...  సాయి నవ్య ... అగ్గిపెట్ట బచ్చా... పాపం వీరి వీడియోలు   .. ఇప్పుడు వెయ్యి వ్యూస్ కూడా సాధించడం లేదెందుకు ? ఐఏఎస్ కానక్కర లేదు . ఎన్నో గౌరవ ప్రధమయిన వృత్తులు . విజ్ఞానాన్ని స్కిల్స్ ను సంతరించుకొంటే లైఫ్ లాంగ్ గ్రోత్ .. ఆదాయం .. గొరవం . సోషల్  మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అంటే కాగితం మంట. 

రెండేళ్లు .. అటు పై పోర్న్ కు దిగితే మరో రెండేళ్లు . బూతులతో ఇంకో రెండేళ్లు . అటుపైన ? ఆవులు ఎడ్లు చేలో మేస్తే దూడలు గట్టున  మేస్తాయా ? పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చి తాము జబర్దస్తులు .. బుల్లిరాజు బూతులు ...  ఓటిటి సెమి పోర్న్ రీల్స్ చూస్తూ...  పేరెంటింగ్ ను గాలికి వదిలేసిన ఆధునిక తల్లితండ్రులకు దేవుడు / ప్రకృతి ఇచ్చిన శాపం .. వారి పిల్లలు  చదువు వదిలి సోషల్  మీడియా స్టార్ లు అయిపోవాలనుకోవడం . కరోనా అనంతర యుగంలో సరి కొత్త కెరీర్ లు వచ్చాయి. పోర్న్ ఫిలిం నటీనటులు, గంజాయి వ్యాపారం , బట్టలు విప్పుతూ సెక్స్ చాటింగ్ చేసే ఫాన్స్ ఓన్లీ అప్ ఉద్యోగాలు , సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగులు. 

బీహార్ కు చెందిన సుభాష్ శర్మ .. 13  ఏళ్లకే కెరీర్ ను ప్రారంభించాడు     సుపారీ హంతక ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు . ఆరేళ్లుగా జైల్లో.. రేపో మాపో .. ఉరి. సమాజము .. సభ్యత .. నీతి నియమాలు .. లాంటి పెద్దపెద్ద మాటలొద్దు. ఎయిడ్స్ , సుఖ రోగాలు,  క్యాన్సర్ .. మానసిక రోగాలు .. జైలు జీవితాలు,  ఆత్మహత్యలు .. హత్యలు .. ఈ దిక్కు మాలిన దారిలో  పిల్లల్ని   నిల్చో   పెట్టడం  ఏంటి చిన రాజు గారు ?
బుద్దుండక్కరలేదా ? మనిషి జన్మ ఎత్తావెందుకురా??

click me!