''పడుకోనైనా సంపాదించు'' నటికి వేధింపులు!

Published : May 08, 2019, 05:01 PM IST
''పడుకోనైనా సంపాదించు'' నటికి వేధింపులు!

సారాంశం

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించిన నటి రాగిణికి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. 

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించిన నటి రాగిణికి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అలా తన కెరీర్ ను సాగిస్తోన్న ఈమె ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన వ్యక్తిగత విషయాలపై కూడా కామెంట్స్ చేసింది.

తన చిన్నతనంలోనే తండ్రికి పక్షవాతం రావడంతో డాన్స్ ప్రదర్శనలు ఇస్తూ ఇంటి ఖర్చు చూసుకునేదాన్ని అంటూ తను పడ్డ కష్టాల గురించి వెల్లడించింది. తనకు పన్నెండేళ్ల వయసులోనే పెళ్లైందని, ఆ సమయంలోనే బాబు కూడా పుట్టాడని చెబుతూ తన భర్తకి  యాక్టింగ్ ఫీల్డ్ అంటే అనుమానమని, బాగా హింసించేవాడని తెలిపింది. 

పెళ్ళైన ఆరు నెలల నుండే భర్త హింసించడం మొదలుపెట్టాడని, తప్పుడు దారుల్లో తిరిగి సంపాదించమని వేధించాడని చెప్పుకొచ్చింది. ఎవడితోనైనా పడుకోనైనా సంపాదించుకురా అంటూ బలవంతం చేసేవాడని గుర్తు చేసుకున్నారు. అలాంటి తప్పుడు పనులు చేయడం ఇష్టం లేదని చెప్పినా వినేవాడు కాదని, ఆ బాధలు భరించలేక అతడి నుండి పెళ్లైన ఏడాదికే విడిపోయినట్లు తెలిపింది.

ఆ సమయంలో పెళ్లి ఫొటోలన్నీ తగలబెట్టేసి వెళ్లిపోయాడని, అప్పటి నుండి తన కొడుకుతోనే జీవించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన కొడుకు జర్మనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నట్లు..తనను బాగా చూసుకుంటున్నట్లు తెలిపింది.   
 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్