సూర్య సినిమాను దర్శకుడు పట్టించుకోవడం లేదా..?

Published : May 08, 2019, 04:22 PM IST
సూర్య సినిమాను దర్శకుడు పట్టించుకోవడం లేదా..?

సారాంశం

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జి కే' అనే సినిమాలో నటిస్తున్నారు. 

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జి కే' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ సూర్య తన దర్శకుడిని ఓ రేంజ్ లో పొగిడాడు. ఎన్నో ఏళ్లుగా సెల్వతో సినిమా చేయాలనుకున్నట్లు ఇప్పటికి కుదిరిందని ఆనందంగా చెప్పారు.

అయితే ప్రెస్ మీట్ లో అలాంటి కామెంట్స్ చేయడం కామనే అని నిజానికి వీరిద్దరి మధ్య సఖ్యత అంత బాగాలేదని కోలివుడ్ వర్గాల సమాచారం. సినిమా విడుదల మరో కొద్దిరోజుల్లో ఉండగా.. దర్శకుడు ఈ సినిమాను పట్టించుకోవడం లేదని టాక్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో దర్శకుడు అసలు ఇన్వాల్వ్ కావడం లేదట.

ప్యాచ్ వర్క్, మిగిలినదంతా కూడా సహాయ దర్శకుడు పూర్తి చేశారని చెప్పుకుంటున్నారు. సినిమా షూటింగ్ సమయంలో సూర్య-సెల్వ మధ్య విబేధాలు వచ్చాయి, దాంతో సెల్వ అలిగి షూటింగ్ లకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టాడని, ఇప్పుడు ఆయన లేకుండానే సినిమా బయటకి వస్తుందని అంటున్నారు.

కనీసం ఆయన ప్రమోషన్స్ కోసమైనా వస్తాడా..? లేదా..? అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. సెల్వ టాలెంటెడ్ డైరెక్టర్ అయినప్పటికీ ఆయన హీరోలను, నిర్మాతలను ఇబ్బంది పెడుతుంటాడని కోలీవుడ్ లో వార్తలు వచ్చేవి. ఇప్పుడు మరోసారి ఆ విషయం నిరూపిస్తున్నాడని అంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కమన్‌ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్