ఆయనతో సంబంధం ఉన్న మాట నిజమే.. నటి కామెంట్స్!

Published : Sep 19, 2018, 03:20 PM ISTUpdated : Sep 19, 2018, 03:21 PM IST
ఆయనతో సంబంధం ఉన్న మాట నిజమే.. నటి కామెంట్స్!

సారాంశం

బుల్లితెర నటి నీలాని కొద్దిరోజల క్రితం తన ప్రియుడు గాంధీలలిత కుమార్ తనను వేధిస్తున్నాడని మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతడి ఆత్మహత్య చేసుకోవడం తమిళనాట షాకింగ్ గా మారింది.

బుల్లితెర నటి నీలాని కొద్దిరోజల క్రితం తన ప్రియుడు గాంధీలలిత కుమార్ తనను వేధిస్తున్నాడని మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతడి ఆత్మహత్య చేసుకోవడం తమిళనాట షాకింగ్ గా మారింది. సినిమా రంగం మీద ఆసక్తితో చెన్నైకి వచ్చిన లలిత్ కుమార్ నటుడు ఉదయనిధి స్టాలిన్ సంస్థలో పని చేసే అవకాశం వచ్చింది.

ఆ తరువాత సహాయ దర్శకుడిగా కొన్ని సినిమాలకు పని చేశారు. అదే సమయంలో నీలానితో పరిచయం ప్రేమ ఏర్పడ్డాయి. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు. అయితే కొంతకాలం తరువాత లలిత్ కుమార్ కి పని లేకుండా పోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.

దీంతో నీలాని, లలిత్ కుమార్ ని వదిలేసి ఒంటరిగా జీవిస్తోంది. అయితే నీలాని తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనస్తాపం చేసిన లలిత్ కుమార్ ఆత్మహత్యకి పాల్పడ్డారు. దీంతో నీలాని మంగళవారం సాయంత్రం చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయానికి వెళ్లి లలిత్ కుమార్ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

ఆ తరువాత మీడియా ముందుకొచ్చిన ఆమె లలిత్ కుమార్ తో తనకు సంబంధం ఉన్న మాట నిజమేనని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని చెప్పింది. లలిత్ కుమార్ తనను వేధించిన కారణంగానే పోలీస్ కంప్లైంట్ చేశానని, డబ్బు తీసుకొని మోసం చేశాడని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్