నేనేం అనను.. దిష్టి తగులుతుంది.. తారక్ ఫోటోపై కామెంట్!

Published : Sep 19, 2018, 02:36 PM IST
నేనేం అనను.. దిష్టి తగులుతుంది.. తారక్ ఫోటోపై కామెంట్!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. 

ఇప్పటికే టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా 'పెనివిటి' అనే మరో పాటను విడుదల చేయనున్నారు. అయితే విడుదలకు ముందే ఈ పాట సోషల్ మీడియాలో అంచనాలను పెంచేస్తుంది.

ఈ పాట ఎలా వుండబోతుందోనని మచ్చుకు కొన్ని లిరిక్స్ ని షేర్ చేసుకున్నారు లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి. 'ఇది మామూలు పాట కాదు.. ఇది నా అదృష్టం. ఇలాంటి సందర్భాన్ని త్రివిక్రమ్ నాకు ఇచ్చారు' అంటూ రామజోగయ్య శాస్తి ట్వీట్ చేశారు.

అలానే 'అరవింద సమేత' సినిమాలో ఎన్టీఆర్ ఫోటోని పోస్ట్ చేస్తూ.. 'నేనేం అనను.. దిష్టి తగులుతుంది' అని కామెంట్ పెట్టారు. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అప్పటిదాకా అబ్బాయిల ఊసే లేదు..! హీరోయిన్ శ్రీలీల అంత మాట అనేసిందేంటి..
టాక్సిక్ లో బోల్డ్ సీన్, ఈ సినిమాకి ఆమె దర్శకురాలు అంటే నమ్మలేకపోతున్నా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్