మరణానికి దగ్గరగా ఉన్నా అంటూ.. మమతా మోహన్‏దాస్ ఆరోగ్యంపై రూమర్లు, ఘాటుగా స్పందించిన నటి,

By Mahesh Jujjuri  |  First Published Nov 10, 2023, 12:16 PM IST

ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలను బాగా టార్గెట్ చేస్తున్నారు. రకరకాలుగా వారిని వేధిస్తున్నారు. సెలబ్రిటీల ఇమేజ్ పెంచుకోవడానికి ఉపమోగపడే సోషల్ మీడియా సైట్లు .. వారిపరువునునిండా ముంచుతున్నాయి. 
 



రీసెంట్ గా సెలబ్రిటీలపై సోషల్ మీడియా దాడులు పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఈ సమస్యలను ఎక్కువగా ఎదుర్కోంటున్నారు. ఇటీవల నాలుగైదు రోజుల కిందట నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరలయ్యిందో చూశాం. ఈ వీడియోపై టాలీవుడ్ , బాలీవుడ్ సెలబ్రెటీలతోపాటు.. రాజకీయ నాయకులు స్పందించారు. ఆతరువాత కత్రీనా కైఫ్ వీడియో వైరల్ అయ్యింది. హీరోయిన్లే కాదు..హీరోల పరిస్థితి కూడా అలానే ఉంది. ఇండస్ట్రీలీలో సెలబ్రిటీలు..  ఈ రూమర్లు,  మార్ఫింగ్ వీడియోలపై ఆందోళన వ్యాక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఇలాంటిదే మరోక సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 

కోలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఆరోగ్యం గురించి రాసిన ఓ తప్పుడు వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది.  ఇది చూసిన ఆ హీరోయిన్ కోపంతో ఊగిపోతోంది. ఇలా అబద్దపు వార్తలను సృష్టించి.. తన పరువు తీస్తున్నందుకు ఆమె మండిపడుతుంది.ఇంతకు అసలు కథ ఏంటంటే.. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి రోజురోజుకూ ఎన్నో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇటువంటి రూమర్స్ ఆ యాక్టర్స్ పరువు తీస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ.. తమ ఇమేజ్ తో పాటు.. అంతో ఇంతో సంపాదన కూడా చేసుకోవచ్చు అనుకుని రెచ్చిపోతుంటారు స్టార్లు. కాని అవే వారికి ఉచ్చులా మారుతున్నాయి. నెట్టింట స్టార్స్ కు ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. 

Latest Videos

వారు పెట్టిన ఫోటోలను తీసుకుని... వారికే షాక్ ఇస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. సెలబ్రిటీల పరువు నిండా కొంత మంది మాత్రం వీటిని పట్టించుకోరు..కాని  కొన్ని సందర్భాల్లో వారి వ్యక్తిగత జీవితం గురించి హద్దుమీరి వల్గర్ గా చూపించనప్పుడు మాత్రం స్పందించక తప్పడంలేదు. రీసెంట్ గా రష్మికకు అదే ఎదురయ్యింది. ఇక తాజాగా మమతా మోహన్ దాస్ ఆరోగ్యంపై కూడా అవే రూమర్లు షికారు చేస్తున్నాయి. 

 

గీతూ నాయర్ అనే ఫేక్ ప్రొఫైల్లో.. మమతా మోహన్ దాస్ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అయ్యింది. అందులో ఏముందంటే.. నేను మరణానికి లొంగిపోతున్నాను. ఇక బతకలేను. మమతా మోహన్‌దాస్ జీవితం దుర్భర స్థితిలో ఉంది అంటూ టైటిల్ తో వార్త సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఇందులో ఆమెను కించపరిచే విధంగా పేర్కొంది. దీనిపై మమతా ఘాటుగానే స్పందించింది.

అసలు ఎవరు నీవు.. ? గీతూ నాయర్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ పేజీపై ఇతరుల గురించి ఇలాంటి వార్తలు ఏంటీ..?ఎవరి  దృష్టిని ఆకర్షించడానికి మీరు ఏదైనా చెబుతారని అనుకుంటాను. దయచేసి ఇలాంటి మోసాన్ని  ఆపండి.. ఇలా అందరిని తప్పుదాని పట్టించవద్దు.  అని పేర్కొన్నారు. అయితే మమతా మోహన్ దాస్ కామెంట్ చేసిన తర్వాత సదరు గీతూ నాయర్ పేజీ డియాక్టివేట్ అయ్యింది.  కాని ఈ న్యూస్ మాత్రం వైరల్ అయ్యింది. ఇండస్ట్రీ నుంచి మమతకు సపోర్ట్ లభిస్తుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mamta Mohandas (@mamtamohan)

ఇక క్యాన్సర్ ను జయించిన మమతా మోహన్ దాస్.. ప్రస్తుతం  మలయాళంలో దిలీప్‌తో బాంద్రా, తమిళంలో విజయ్ సేతుపతితో మహారాజా సినిమాలు చేస్తోంది. మమతా మోహన్ దాస్ తెలుగులో చింతకాయల రవి, యమదొంగ, కృష్ణార్జున, హోమం చిత్రాల్లో నటించింది. ఇటీవల జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

click me!