సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్, విజయవాడలో సందడి చేసిన లోకనాయకుడు.

Published : Nov 10, 2023, 11:13 AM IST
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్, విజయవాడలో సందడి చేసిన లోకనాయకుడు.

సారాంశం

లోకనాయకుడు కమల్ హాసన్ బెజవాడలోసందడి చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు కమల్.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.   


లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం బెజవాడలో సందడి చేస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ కోసం విజయవాడ వచ్చారు కమల్. పనిలో పనిగా సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా..ఆహ్వానం అందటంతో.. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మరో సూపర్ స్టార్ కమలహాసన్ విజయవాడలో ఆవిష్కరించారు. నగరంలోని గురునానక్ కాలనీలో కృష్ణ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. 

ఇక ఈక్రమంలో.. ఈకార్యక్రమంలో విజయవాడ  తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాశ్‌ కూడా పాల్గొన్నారు. కమల్ తో కలిసి ఈ కార్యక్రమలో పాలు పంచుకున్నారు. ఇక  ఈ సందర్భంగా అవినాశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. 

 

ఆయన వారసుడు మహేశ్‌బాబు సినీ రంగంలో తనదైన ముద్ర వేయడంతోపాటు సేవా రంగంలోనూ ముందున్నారని కొనియాడారు. షూటింగ్స్‌తో నిత్యం బిజీగా ఉండే కమలహాసన్ విజయవాడ వచ్చి కృష్ణ విగ్రహన్ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని, విజయవాడ ప్రజలు, కృష్ణ, మహేశ్‌బాబు అభిమానుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.

ఇక కమల్ హాసన్ కొన్ని రోజులు విజయవాడలోనే ఉండనున్నారు. ఆయన అసలు బెజవాడకు షూటింగ్ కోసం వచ్చారు. శంకర్ డైరెక్షన్ లో కమల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ  ఇండియన్ 2. ఈమూవీపై ఆడియన్స్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దేశ విదేశాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. విజయవాడలో 8000 వేల మందితో ఇంపార్టెంట్ సీన్ ను తెరకెక్కిస్తున్నార ట టీమ్. 

PREV
Read more Articles on
click me!